అప్పుచేసి మ‌దుపు చేయ‌డం అన‌వ‌స‌రం

అప్పుతీసుకుని మ‌దుపు చేస్తే లాభ‌మా? న‌ష్ట‌మా?​​​​​​...

Published : 18 Dec 2020 17:17 IST

అప్పుతీసుకుని మ‌దుపు చేస్తే లాభ‌మా? న‌ష్ట‌మా?

రిటైల్ మ‌దుప‌ర్ల ప్ర‌ధాన ల‌క్ష్యం త‌మ పెట్టుబ‌డుల‌ను స‌క్ర‌మ‌మైన సాధ‌నాల్లో మ‌దుపు చేసి దీర్ఘ‌కాలంలో లాభం పొంద‌డ‌మే. డ‌బ్బును అప్పుగా తీసుకుని మ‌దుపు చేస్తే లాభ‌మేనా? రుణం తీసుకున్నందుకు గానూ కొంత‌ వ‌డ్డీ చెల్లించాలి. మ‌దుపు చేసే మొత్తం పై వ‌చ్చే రాబ‌డి ఆ వ‌డ్డీ రేటు కంటే ఎక్కువ‌గా ఉండాలి.అప్పుడు మాత్ర‌మే ప్ర‌యోజ‌నం ఉంటుంది. కానీ ఇది న‌ష్ట‌భ‌యంతో కూడుకుని ఉండే వ్య‌వ‌హారం. మ‌దుప‌రి అనుకున్నంత రాబ‌డి వ‌స్తే ఫ‌ర్వాలేదు. రాక‌పోతే ప‌రిస్థితి ఏంటి? ముందుగా ఈ ఆలోచ‌న క‌ల‌గాలి. మ‌దుపు చేయ‌డం ద్వారా వ‌చ్చే రాబ‌డి మ‌నం వేసే అంచ‌నా మాత్ర‌మే. అంతెందుకు గ‌తంలో రుణం తీసుకుని మ‌దుపు చేయ‌డం ద్వారా ఎవ‌రికో లాభం వ‌చ్చింద‌నే అనుకుందాం. అదే విధంగా భ‌విష్య‌త్తులో కూడా జ‌రుగుతుంద‌ని చెప్ప‌లేం. ఇది పూర్తిగా మ‌దుప‌ర్లు చేసే పెట్టుబ‌డులు, ఎంచుకునే అసెట్ క్లాసులు త‌దిత‌ర వాటిపై ఆధార‌ప‌డి ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌:

ఒక వ్య‌క్తి వ‌డ్డీ రేటు 10 శాతం చొప్పున రుణం తీసుకుని బాండ్ల‌లో పెట్టుబ‌డి చేశార‌నుకుందాం. ప్ర‌స్తుతం బాండ్ల‌పై వ‌చ్చేఆదాయం 10 శాతం కంటే త‌క్కువ ఉంటుంది. లేదా ఎక్కువ వ‌డ్డీ రేటు ఇచ్చే బాండ్ల క్రెడిట్ రేటింగ్ త‌క్కువ‌గా ఉంటుంది. దీనికి న‌ష్ట‌భ‌యం కొంత ఉంటుంది. కాబ‌ట్టి ఇవి అంద‌రికి స‌రిప‌డ‌తాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం.

హెచ్ఎన్ఐల లెక్క వేరు:

కొన్ని కార్పోరేట్ ట్రెజ‌రీలు అధిక నిక‌ర‌విలువ క‌లిగిన మ‌దుప‌ర్ల(హెచ్ఎన్ఐల)తో క‌లిగి ఉంటాయి. వారు పెట్టుబ‌డుల‌కు సంబంధించి నిపుణులు, వెల్త్ మేనేజ‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెట్టుబ‌డులు చేస్తుంటారు. అలాంటి చోట్ల కొంత మొత్తం రుణం గా తీసుకుని పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా మంచి రాబ‌డులు పొందేందుకు అవ‌కాశాలుంటాయి. అయితే ఈ విధమైన కార్పోరేట్ ట్రెజ‌రీలు సామాన్య మ‌దుప‌ర్లకు అందుబాటులో ఉండ‌వు. ఎందుకంటే వీటి ద్వారా పెట్టుబ‌డి చేసేందుకు
క‌నీస మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది. చిన్న మ‌దుప‌ర్లకు చిన్న మొత్తంలో పెట్టుబ‌డులు చేస్తుంటారు. వారికి రుణం తీసుకుని మ‌దుపు చేయ‌డం అంత సూచ‌నీయం కాద‌నే చెప్పాలి.

అప్పు ఎప్పుడంటే:

దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు ఉన్న మ‌దుప‌ర్లు అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌పుడు వాటిని తీసివేయ‌కుండా ఉదాహ‌ర‌ణ‌కు కొంత మొత్తంలో డ‌బ్బు అవ‌స‌రం వ‌చ్చింది. అయితే ఆ మొత్తం కొన్ని నెల‌ల్లో తిరిగి పెట్టుబ‌డులోకి పెట్టేందుకు అందుతుంది. ఆ సంద‌ర్భంలో దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించ‌కుండా వాటిని త‌న‌ఖా గా పెట్టి రుణం పొంద‌వ‌చ్చు. దీనికి కొంత వ‌డ్డీ చెల్లించాల్సిన‌ప్ప‌టికీ మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు పెట్టిన పెట్టుబ‌డుల‌ను మ‌ధ్య‌లో ఉప‌సంహ‌రించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

అదే మొత్తం పెట్టుబ‌డి ఉప‌సంహ‌రించిన‌ట్ట‌యితే తిరిగి మ‌దుపు చేసేట‌ప్ప‌ట‌కి వాటి విలువ పెరిగిపోవ‌చ్చు. చిన్న మ‌దుప‌ర్ల‌కు ఇది అంత సూచీనీయం కాదు.
కార్పొరేట్ ట్రెజ‌రీలు రుణాలకు అయ్యే వడ్డీ వ్యయం ఖాతా పుస్తకాలలో వ్యయంగా పరిగణించే ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. తద్వారా పన్ను మిన‌హాయింపు ల‌భించ‌డం , రుణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు వీల‌వుతుంది.వ్యక్తిగా, మీరు వ్యాపార ఖాతాలో రుణాన్ని తీసుకుంటే త‌ప్ప ఈ ర‌క‌మైన ప్రయోజనం ఉండదు, వీటికి రుణ నిబంధనల ప్రకారం వాటి వినియోగంపై పరిమితులు ఉండవచ్చు.

హెచ్ఎన్ఐలకు, ఎప్పటికప్పుడు కొత్త కొత్త అవ‌కాశాలు ఏర్ప‌డుతుంటాయి. ఉదాహరణకు, 2013 లో ఎన్ఆర్ఐల కోసం ఎఫ్‌సీఎన్ఆర్ విండో ఆ స‌మ‌యంలో హెచ్ఎన్ఐల బృందంలో ఉంటేనే అవ‌కాశాన్ని పొంద‌వ‌చ్చు. షేర్ మార్కెట్లు మంచి ఉత్సాహంగా ఉన్న‌పుడు పెట్టుబ‌డులు ఎక్కువ‌గా పెట్టి ఎక్కువ మొత్తంలో రాబ‌డి ఆర్జించాల‌ని మ‌దుప‌ర్ల‌కు ఉంటుంది.

అన్ని వేళ‌లా ఫ‌లిస్తుంద‌ని చెప్ప‌లేం:

మార్కెట్లు జోరుగా ఉన్న సంద‌ర్భంలో అప్పు తీసుకుంటే చెల్లించే వ‌డ్డీ కంటే ఈక్విటీలో చేసే పెట్టుబ‌డులుపై వ‌చ్చే రాబ‌డి అధికంగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఐపీఓలో పెట్టుబ‌డి చేసి లిస్టింగ్ ప్రీమియంతో అయితే వ‌చ్చే లాభాల‌ను పొందొచ్చ‌ని కొంద‌రు భావించ‌వ‌చ్చు. అయితే అన్ని ఐపీలోలు ప్రీమియంతోనే లిస్ట‌వుతున్నాయా? మ‌దుప‌ర్లు ఈ ప్ర‌శ్న వేసుకోవాలి. కొన్ని ఐపీఓలు ఆఫ‌ర్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కు లిస్ట‌యిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని