క‌రోనా వైర‌స్: ఇప్పుడు సిప్ చేయాలా ?

సిప్ మ్యూచువల్ ఫండ్ల‌ కొనుగోలు ధరను సగటు చేస్తుంది ఎందుకంటే ఇది వేర్వేరు సమయాల్లో ఫండ్‌లోకి డబ్బును చేరుస్తుంది....

Published : 22 Dec 2020 17:22 IST

సిప్ మ్యూచువల్ ఫండ్ల‌ కొనుగోలు ధరను సగటు చేస్తుంది ఎందుకంటే ఇది వేర్వేరు సమయాల్లో ఫండ్‌లోకి డబ్బును చేరుస్తుంది.

క‌రోనా వైరస్ విజృంభ‌న‌తో గ‌త నాలుగైదు రోజుల నుంచి మార్కెట్లు ఎలా ప‌త‌న‌మ‌య్యాయో చూశాం. మార్చి 12 నాటికి ఏకంగా 20 శాతం న‌ష్ట‌పోయాయి. అయితే శుక్ర‌వారం మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి కొంత పుంజుకున్నాయి. కానీ నిఫ్టీ ఇంకా ప‌దివేల‌కు దిగువ‌న 9,985 వ‌ద్ద ఉంది. ఇది నిఫ్టీ గ‌రిష్ఠ స్థాయి కంటే 16 శాతం త‌క్కువ‌. అయితే ఇటువంటి సంద‌ర్భాల్లో మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలికంగా లాభాల‌నిస్తాయ‌ని ఆర్థిక విశ్లేష‌కులు చెప్తున్నారు.

అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా మార్కెట్ల‌లో అడుగుపెట్టేందుకు రెండు ఆప్ష‌న్లు ఉన్నాయి. ఒక‌టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం లేదా సిప్ చేయ‌డం. దీంతో ప్ర‌తి నెల కొంత మొత్తాన్ని మార్కెట్ల‌లో పెట్టుబ‌డులుగా పెట్ట‌వ‌చ్చు. సాధార‌ణంగా ఆర్థిక నిపుణులు సిప్ రూపంలో పెట్టుబ‌డుల‌నే ప్రోత్స‌హిస్తారు. ఎందుకంటే కొంత మొత్తంతో వేర్వేరు ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం ఉంటుంది. అదికాకుండా చాలామందికి నెల‌వారిగా వేత‌నాలు అందుతాయి కాబ‌ట్టి వారి ఖ‌ర్చుల‌కు త‌గిన‌ట్లుగా కొంత మొత్తంతో సిప్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

అయితే ఇలా మార్కెట్ల‌లో దిద్దుబాటు ఏర్ప‌డిన‌ప్పుడు దూకుడుగా ఉన్న పెట్టుబ‌డుదారులు ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చ‌ని చెప్తున్నారు. మ‌ధ్య‌స్థాయి పెట్టుబ‌డిదారుడు రెండు, మూడు ద‌శ‌ల్లో పెట్ట‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే సిప్ ఉంటే వాటిని కొన‌సాగించాల‌ని సూచిస్తున్నారు. స‌గ‌టు పెట్టుబ‌డుదారుడికి సిప్ ద్వారా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఉత్త‌మ మార్గం. రిస్క్ తీసుకోవాల‌నుకునేవారు ఈ స‌మ‌యంలో ఒకేసారి ఎక్కువ మొత్తం పెట్టుబ‌డుల‌ను ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని