Signature Bank: అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
Signature Bank: క్రిప్టో డిపాజిట్లు అధికంగా ఉన్న న్యూయార్క్ సిగ్నేచర్ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు అమెరికా నియంత్రణ సంస్థలు ఆదివారం ప్రకటించాయి.
వాషింగ్టన్: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (Silicon Valley Bank) ఉదంతం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. అమెరికాలో మరో బ్యాంక్ మూతపడింది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సంబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్ (Signature Bank)ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ఆదివారం సాయంత్రం ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడడంతో బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
సిగ్నేచర్ బ్యాంకును ‘ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ)’ తన నియంత్రణలోకి తీసుకుంది. సిగ్నేచర్‌కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని ఎఫ్‌డీఐసీ పేర్కొంది. అందుకోసం తాత్కాలికంగా ఓ ‘బ్రిడ్జ్ బ్యాంక్’ను ఏర్పాటు చేశామని తెలిపింది. దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్లు, డిపాజిటర్లు తమ నిధులకు యాక్సెస్ పొందొచ్చని పేర్కొంది. ఈ తాత్కాలిక బ్యాంకుకు గ్రెగ్ కార్మికేల్ అనే బ్యాంకింగ్ నిపుణుడిని సీఈఓగా నియమించింది.
సిగ్నేచర్ బ్యాంక్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వాణిజ్య బ్యాంకు. స్థిరాస్తి, డిజిటల్ అసెట్స్ బ్యాంకింగ్ సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో ఈ బ్యాంకు సేవలందిస్తోంది. గత ఏడాది సెప్టెంబరు నాటికి ఈ బ్యాంకు డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో రంగం నుంచి వచ్చినవే. అయితే, తమ క్రిప్టో ఆధారిత డిపాజిట్లను త్వరలోనే 8 బిలియన్ డాలర్లకు కుదించుకుంటామని డిసెంబరులో బ్యాంకు ప్రకటించింది. మరోవైపు తమ సీఈఓ జోసెఫ్ డీపావోలో సీనియర్ సలహాదారుగా మారనున్నారని ఫిబ్రవరిలోనే తెలిపింది. ఆయన స్థానంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎరిక్ హొవెల్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. బ్యాంకు ప్రారంభమైన 2001 నుంచి డీపావోలో సీఈఓ, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం : బైడెన్
ఎస్‌వీబీ, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి కారణమైన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అలాగే డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయని.. అందుకు తాను హర్షిస్తున్నానని తెలిపారు.
మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికే సిగ్నేచర్ బ్యాంకుపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మరోవైపు బ్యాంకులు ద్రవ్యలభ్యత సమస్యలు ఎదుర్కోకుండా 25 మిలియన్ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఫెడ్ ప్రకటించింది. అలాగే సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో డిపాజిట్‌దారులు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు సోమవారం నుంచి అనుమతి ఉంటుందని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో
-
Politics News
సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను శిక్షించాలి: ఏక్నాథ్ శిందే
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Movies News
Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్ 2.. ప్రీబుకింగ్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్