సింగపూర్‌కు వెళ్లాలంటే కొవిడ్‌ పరీక్ష తప్పనిసరి

జనవరి 25 తర్వాత నుంచి సింగపూర్‌కు వచ్చే ప్రతి ఒక్కరు కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పటి వరకు సింగపూర్‌లో ఉండే నాన్‌రెసిడెంట్స్‌, యాత్రికులు

Published : 17 Jan 2021 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జనవరి 25 తర్వాత నుంచి సింగపూర్‌కు వచ్చే ప్రతి ఒక్కరు కొవిడ్‌ టెస్ట్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పటి వరకు సింగపూర్‌లో ఉండే నాన్‌రెసిడెంట్స్‌, యాత్రికులు మాత్రం ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్‌టీపీసీఆర్‌ చేయించుకోవాలి. తర్వాత కొన్నాళ్లు ఇంట్లోనే ఉండి..తర్వాత సాధారణ ప్రజల్లో కలవడానికి మరోసారి పరీక్ష చేయించుకోవాలి.  

తాజా నిబంధనల ప్రకారం సింగపూర్‌ ప్రజలు కూడా పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలి. ముఖ్యంగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌, సౌత్‌ ఆఫ్రికా వంటి ప్రదేశాల నుంచి వచ్చిన వారు 14రోజులు ఇంట్లో ఉండటంతో పాటు.. మరో ఏడు రోజులు అదనంగా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలి. యుకే, దక్షిణాఫ్రికాల్లో కొత్త స్ట్రెయిన్‌ అధికంగా వ్యాపించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇక్కడికి రావాలనుకునే వారు రెసిప్రోకల్‌ గ్రీన్‌ లేన్‌ అండ్‌ ఎయిర్‌ ట్రావెల్‌ పాస్‌ ఏర్పాట్ల కింద దరఖాస్తు చేసుకోవాలి. దీనికింద కరోనావైరస్‌ చికిత్సకోసం  22,560 డాలర్ల కవరేజి ఉన్న ఆరోగ్యబీమా తప్పనిసరిగా తీసుకోవాలి. సింగపూర్‌లో విదేశాల నుంచి వచ్చిన వారిలో 28కి కరోనా సోకినట్లు గుర్తించారు.  వీరంతా ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి

రేపటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో మొదలు

బీఎస్‌ లిమిటెడ్‌తో బ్యాంకర్లు కుమ్మక్కు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని