Mutual funds: మ్యూచువల్‌ ఫండ్స్‌ @ ₹60 లక్షల కోట్లు

Mutual funds: మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నాయి. దీంతో వాటిలో పెట్టుబడుల విలువ రూ.60 లక్షల కోట్లు దాటింది.

Published : 09 Jul 2024 20:07 IST

Mutual funds | ముంబయి: దేశీయ మ్యూచువల్‌ ఫండ్లలోకి (Mutual funds) పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడులకు (SIP) అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. తాజా డేటానే ఇందుకు నిదర్శనం. సిప్‌ విధానంలో ఈ ఏడాది జూన్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.21,262 కోట్లను మదుపర్లు పెట్టుబడిగా పెట్టారు. మే నెలలో ఈ మొత్తం రూ.20,904 కోట్లుగా ఉంది. ఈ మేరకు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (Amfi) మంగళవారం ఈ డేటాను వెలువరించింది. దీంతో సిప్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.12.43 లక్షల కోట్లకు చేరింది. జూన్‌ నెలలో కొత్తగా 55 లక్షల కొత్త సిప్‌లు తెరుచుకోవడంతో మొత్తం సిప్‌ల సంఖ్య 8.98 కోట్లకు చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌.. 13న ఈ సర్వీసులు పనిచేయవ్‌!

మరోవైపు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి జూన్‌ నెలలో పెట్టుబడులు 17 శాతం పెరిగి రూ.40,608.19 కోట్లకు చేరినట్లు యాంఫై డేటా పేర్కొంది. అంతకుముందు నెల ఈ మొత్తం రూ.34,697 కోట్లుగా ఉంది. అదే సమయంలో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి రూ.1.07 లక్షల కోట్ల నిధులను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. జూన్‌ చివరి నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.61.33 లక్షల కోట్లకు చేరినట్లు యాంఫై చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ చలసాని పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లోని పెట్టుబడుల విలువ రూ.60 లక్షల కోట్ల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని