మదుపరి అన్నాక కొసింత సిప్ పెంచుతుండాలి
రూ.25.2 లక్షలు, రూ.37.5 లక్షలు ,రూ. 43.4 లక్షలు . ఈ మూడింటికి ఎంత వ్యత్యాసముందో గమనించారా...
రూ.25.2 లక్షలు, రూ.37.5 లక్షలు ,రూ. 43.4 లక్షలు . ఈ మూడింటికి ఎంత వ్యత్యాసముందో గమనించారా.
సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మదుపర్లు ప్రతీనెలా మదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందవచ్చు. దీర్ఘకాలంపాటు పెట్టుబడి చేసే వారు ఒకే మొత్తం సిప్ చేసే కంటే సంవత్సరానికి ఒక సారి పెంచుతూ వెళ్తే వచ్చే ప్రతిఫలం మరింత బావుంటుంది. మన ఆదాయం వృద్ధి చెందేటపుడు చేసే పెట్టుబడి కూడా వృద్ధి చెందాలి. అప్పుడే మన ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించగలం.
12 శాతం రాబడి అంచనా, 15 ఏళ్ల పరిమితికి
- ఒక మదుపరి నెలకు సిప్ రూ.5000 చివరి వరకూ కొనసాగిస్తే రూ.25.2 లక్షలు అందుతుంది.
- స్థిరంగా 10 శాతం పెంచితే రూ.37.5 లక్షలు ,
- ప్రతీ ఏడాది మునుపటి సిప్ కు 10 శాతం పెంచితే రూ. 43.4 లక్షలు మదుపర్లు పొందవచ్చు. ఈ మూడింటికి ఎంత వ్యత్యాసముందో గమనించారా.
ఉదాహరణకు 15 ఏళ్ల పాటు ఒక మదుపరి రూ.5,000 చొప్పున ప్రతీ నెల సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేశారనుకుందాం. అన్నిసంవత్సరాలు నెలకు ఒకే మొత్తం క్రమానుగతంగా ఫండ్లలోకి పెట్టుబడిగా వెళ్తుంది.
లెక్కల్లో చూస్తే:
సరాసరి మ్యూచువల్ ఫండ్ల పై వచ్చే రాబడి 12 శాతం అనుకుందాం. అప్పుడు 15 ఏళ్లకు నెలకు రూ.5 వేలు చొప్పున మదుపుచేస్తే అంతిమంగా ఆ మదుపరికి లభించేంది రూ.2522880 (25.2 లక్షలు)
మొత్తం పెట్టుబడి రూ.9,00,000 (9 లక్షలు)
మొత్తం వృద్ధి రూ.16,22,880 (16.2 లక్షలు)
మొత్తం డబ్బు రూ.25,22,880 (25.2 లక్షలు)
స్టెప్ అప్ సిప్ అనే ఆప్షన్ తో మదుపర్లు చేసే సిప్ లో ఏడాదికో లేదా ఆరునెలలకోసారి పెంచే అవకాశం ఉంటుంది.
అదే పైన చెప్పిన స్టెప్ అప్ సిప్ ద్వారా ఏడాదికి పెరిగిన జీతానికి అనుగుణంగా మదుపరి సిప్ స్థిరంగా 10 శాతం చొప్పున పెంచుతూ వెళ్లారనుకుందాం. ఆ మదుపరికి 15 ఏళ్ల తర్వాత లభించే మొత్తం రూ. 37,54,640 లక్షలు,
అదే ప్రతీ ఏడాది సిప్ అంతకు ముందు సిప్ మొత్తానికి 10 శాతం పెంచుకుంటూ వెళ్లే వచ్చే మొత్తం.43,41,925
సిప్ పెంచితే రాబడి ఎలా వృద్ధి చెందుతుందో వివరంగా చూద్దాం.
స్థిరంగా ప్రతీ ఏడాది పూర్తయిన తరువాత 10 శాతం చొప్పున (రూ.500 ) పెంచుకుంటే వెళ్తే కింది విధంగా లెక్క ఉంటుంది. ఈ సందర్భంలో పెంపు స్థిరంగా రూ.500 మాత్రమే ఉంటుంది.
మొత్తం కాలానికి సంవత్సరానికి 10 శాతం సిప్ పెంచడం ద్వారా పెట్టుబడి ఏ విధంగా వృద్ధి చెందుతుందో తెలుసుకుందాం.
ఈ సందర్భంలో సిప్ ప్రతీ ఏడాది 10 శాతం పెంపు ఉంటుంది. తదుపరి సంవత్సరం అప్పటికి ఉన్న సిప్ మొత్తంపై 10శాతం ఉంటుంది.
గత ఏడాది సిప్ కు 10 శాతం చొప్పున పెంచుకుంటే వెళ్తే
- మొత్తం పెట్టుబడి 19,06,349 (19.06 లక్షలు).
- చివరికి లభించే మొత్తం డబ్బు 43,41,925 (43.41లక్షలు) గా ఉంటుంది.
ఎలా చేయాలి?
ప్రస్తుతం దాదాపు అన్ని మ్యూచువల్ ఫండ్లు ఈ టాప్ అప్ సిప్ విధానాన్ని అందిస్తున్నాయి. అయినా ఈ విషయంలో మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా మదుపర్లు పథకంలో చేరేటపుడే సిప్ విధానంలో ఎంత మొత్తం పెంచుతూ వెళ్లాలనుకుంటున్నారో మ్యూచువల్ ఫండ్ల సంస్థలు తెలపాల్సిందిగా కోరుతాయి.
ప్రతీ ఏడాది సిప్ మొత్తం పెంచుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.
- ఒకటి అదే ఫండ్‌లో ఎంత మొత్తం పెంచాలనుకుంటున్నారో తెలియచేయడం.
- రెండోది కొత్త సిప్ ను తీసుకోవడం. ఈ రెండు పద్ధతుల్లోనూ అదే ఫండ్‌లో పెట్టుబడి చేయవచ్చు.
నెలనెలా ఎంత మొత్తం ఎక్కువగా మదుపు చేయాలనుకుంటే అంత ఆ పథకంలో లేదా వేరొక పథకంలో అదే ఫోలియోతో పెట్టుబడి చేయవచ్చు.(కానీ రెండింటి కలపరు.)
సిప్ మొత్తాన్ని పెంచేందుకు ప్రత్యేక విధానాన్నిఎందుకు అమలుచేస్తున్నారంటే… మదుపర్లు ఈ విధానంలో తప్పకుండా బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు వివరాలు తెలియచేయాలి. ఒక సారి రిజిస్ట్రర్ అయితే ప్రతీ నెలా ఆ ఖాతా నుంచి డబ్బు మ్యూచువల్ ఫండ్ లోకి వెళ్తుంది. అప్పటికే సిప్ ను కలిగిన వారికి నెలవారీ మొత్తాన్ని పెంచే అవకాశం చాలా తక్కువ ఫండ్లు అనుమతిస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నూతనంగా ఏర్పాటుచేసిన నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) మదుపరి కావాలనుకుంటే భవిష్యత్తులో చేయబోయే పెట్టుబడులకు సంబంధించి సిప్ మొత్తం, కాలపరిమితి తదితర మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం లభిస్తోంది.
మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద సాధారణ సిప్ దరఖాస్తులు ఉంటాయి. సిప్ విధానంలో దరఖాస్తు చేసేటపుడు ప్రారంభ తేదీ, ప్రతీ నెలా చేయాలనుకుంటున్నపెట్టుబడి, నగదు బదిలీ అయ్యేతేదీ, ముగింపు తేదీ తదితర వివరాలను అందించాలి. కొన్ని ఫండ్లు ఆరు నెలలకోసారి సిప్ మొత్తాన్ని పెంచేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
ముందుగా నిర్ణయించుకోవాలి:
ఎంత మొత్తాన్ని సిప్ ద్వారా పెంచాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో పెరిగే సిప్ ను చెల్లించేందుకు వీలుపడదు అనుకుంటే గరిష్ఠ పరిమితిని నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ప్రతీ ఏడాది 5 శాతం చొప్పున సిప్‌లలో వృద్ధి ని చేయాలనుకుంటున్నారు అనుకుందాం. సరిగ్గా 15ఏళ్ల తర్వాత మదుపరి చెల్లించాల్సిన సిప్ మొత్తం నెలకు రూ.10,371. మదుపరి నిర్ణయించిన గరిష్ఠ పరిమితి రూ.9,000 నిర్ణయించారని అనుకుందాం. తాకినట్లయితే సిప్ పెంపు ఆప్షన్ రద్దవుతుంది. గరిష్టంగా ఎంత మొత్తం సిప్ ఉంటుందో అదే మొత్తం మిగిలిన కాలానికి చెల్లించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.