Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం భారం ఇలా తగ్గించుకుందాం!
Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న కొన్ని మార్గాలను చూద్దాం!
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్య బీమా పాలసీలపై ప్రీమియం (Health insurance premium) మొత్తాలను పెంచేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొవిడ్ అనంతరం ఆరోగ్య బీమా క్లెయిములు పెరగడమే దీనికి కారణం! అందువల్లే ప్రీమియం మొత్తాలను పెంచే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. గతేడాది 30% వరకు ప్రీమియం మొత్తాన్ని పెంచిన కంపెనీలు, ఈ ఏడాది మళ్లీ పెంచనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియం (Health insurance premium) ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న కొన్ని మార్గాలను చూద్దాం..
ఆన్లైన్లో కొనుగోలు..
బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి ఉన్న తొలి మార్గం మీ పాలసీని ఆన్లైన్లో కొనుగోలు చేయడం. ఆన్లైన్లో బీమా పంపిణీ ఆఫ్‌లైన్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కొంతమేర నిర్వహణ వ్యయాల్ని తగ్గించుకోగలుగుతాయి. ఈ ప్రయోజనంలో కొంత భాగాన్ని పాలసీదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో కంపెనీలు ప్రీమియంలో రాయితీ కల్పిస్తాయి.
చిన్న వయసులోనే..
ఆరోగ్య బీమా ప్రీమియం (health insurance premium)పై ఎక్కువగా ప్రభావం చూపే అంశం వయసు. చిన్న వయసులోనే కొనుగోలు చేయడం వల్ల తగ్గింపు లభిస్తుంది. ముందు నుంచీ వ్యాధులు ఉన్నవారికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఒకేసారి 2-3 ఏళ్లకు..
ఈ రోజుల్లో చాలా బీమా సంస్థలు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఆరోగ్య పాలసీలను అందిస్తున్నాయి. దీనివల్ల ప్రీమియం తగ్గింపుతో పాటు, ఏటా పెరిగే పెంపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు రెండేళ్ల ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా 10 శాతం వరకు తగ్గింపు, మూడేళ్ల పాలసీపై 15 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.
ఫ్యామిలీ ఫ్లోటర్..
ఆరోగ్య బీమా అవసరాలు ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. అయితే, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లను ఒక కుటుంబంలోని సభ్యులందరికీ సరిపోయేలా రూపొందించారు. ఒక వ్యక్తికి మాత్రమే వర్తించే వ్యక్తిగత కవర్‌కు భిన్నంగా, ఫ్యామిలీ-ఫ్లోటర్ ప్లాన్ మొత్తం కుటుంబ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఒక్కొక్కరికీ వ్యక్తిగత ప్లాన్‌ను తీసుకోవడంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ప్రీమియంకే అందుబాటులో ఉంటుంది. కుటుంబంలో వైద్య చికిత్స అవసరమైన ఎవరైనా ప్లాన్ కింద హామీ ఇచ్చిన మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
నో క్లెయిమ్ బోనస్..
‘నో క్లెయిమ్ బోనస్ (NCB)’ తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా మొత్తాన్ని పొందడానికి గొప్ప మార్గం. పాలసీ వ్యవధిలో ఎటువంటి బీమా క్లెయిమ్ చేయకుంటే, ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే తదుపరి సంవత్సరానికి మీ పాలసీలో భాగంగా అదనపు బీమా మొత్తాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో, చాలా బీమా సంస్థలు ఎన్సీబీ వెసులుబాటుని అందిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు రూ.10 లక్షల మొత్తంతో పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు క్లెయిమ్ చేయలేదు. అప్పుడు బేస్ పాలసీ కంటే అదనంగా రూ.8-10 లక్షల బీమా మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది. మీరు తీసుకునే పాలసీ ఏ రకమైన ఎన్సీబీ ప్రయోజనాలను అందజేస్తుందో ముందే తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్‌పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్‌లో కొత్త ఫోన్లు