ముంద‌స్తు పన్ను ప్రణాళిక వేసుకుంటున్నారా?

ముందుగా ప‌న్ను ప్ర‌ణాళిక వేసుకోవ‌డం ద్వారా , మార్కెట్లో లభ్యమయ్యే వివిధ ఉత్పత్తులను సరిపోల్చడానికి త‌గిన స‌మ‌యం ఉంటుంది......​

Published : 19 Dec 2020 16:22 IST

ముందుగా ప‌న్ను ప్ర‌ణాళిక వేసుకోవ‌డం ద్వారా , మార్కెట్లో లభ్యమయ్యే వివిధ ఉత్పత్తులను సరిపోల్చడానికి త‌గిన స‌మ‌యం ఉంటుంది.​​​​​​​

2018-19 చివరి త్రైమాసికానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఇంకా పన్ను ప్రణాళికను పూర్తి చేయకపోతే ఇప్ప‌డే ప్రారంభించండి. ముందుగానే ప‌న్ను ప్ర‌ణాళిక‌ను వేసుకోవ‌డం ద్వారా ప‌న్నుమిన‌హాయంపు ల‌భించే మొత్తాన్ని అంచ‌నావేసి త‌ద‌నుగుణంగా పెట్టుబ‌డుల‌ను ప్రారంభం నుంచే చేసుకునే వీలుంటుంది.చివ‌రి నిమిషంలో ఏదొక దాంట్లో పెట్టుబ‌డి చేసేకంటే ఉన్న‌వాటిలో మంచివాటిని ఎంపిక చేసుకుని మ‌దుపు చేసేందుకు వీలుంటుంది. ఈక్విటీ సంబంధిత ప‌న్ను మిన‌హాయింపు ప‌థ‌కాల‌ను ఎంచుకునే వారు మార్కెట్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌మ పెట్టుబ‌డల‌ను కొంచెంకొంచెంగా చేసుకోవ‌చ్చు. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఆధారంగా ఈక్విటీ, డెట్ పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. చివరి నిమిషంలో కంగారు ప‌డేకంటే , ముంద‌స్తుగా పన్ను ప్రణాళికను వేసుకోవ‌డం మంచిది. పన్ను ప్రణాళిక కోసం కొన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికలను చూద్దాం

ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ పథకాలు:

మీరు ఈక్విటీ-లింక్డ్ పొదుపు పథకాలలో (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబడి ద్వారా దీర్ఘ-కాలంలో మంచి వృద్ధిని పొంద‌వ‌చ్చు. మీరు ఏకమొత్తంగా లేదా సిప్ విధానంలో పెట్టుబడి చేసేంద‌కు ఎంచుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది. సెక్షన్ 80 (సీ) కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తుంది.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్):

యూలిప్ బీమా ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడిని ఈక్విటీలో పెట్టుబ‌డి చేస్తారు.యూలిప్ లో లాక్-ఇన్ వ్యవధి ఐదు సంవత్సరాలు.

ఇతర ప్రత్యామ్నాయాలు:

తక్కువ నష్ట భ‌యం ఉన్న పన్నుమిన‌హాయింపు ప‌థ‌కాల‌ను చూస్తున్నట్లయితే సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపుకు అర్హమైన సుకన్య స‌మృద్ధి యోజన (పాప‌ ఉంటే), పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ త‌దిత‌ర పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు.

జాతీయ పింఛ‌న్ ప‌థ‌కం (ఎన్‌పీఎస్):

ప‌ద‌వీ విరమణను దృష్ట్యా అనుకూలంగా ఉండే పెట్టుబడి పథకం. ఇది సెక్షన్ 80 (సీ) కింద పేర్కొన్న రూ.1.5 ల‌క్ష‌ల‌కు అద‌నంగా సెక్షన్ 80 (సీసీడీ) కింద 50,000 మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. మెచ్యూరిటీ మొత్తంపై 60 శాతానికి ప‌న్ను మిన‌హాయింపు కూడా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని