Petrol Price: కేంద్రం బాటలో.. పెట్రోల్‌పై పన్నులు తగ్గించిన రాష్ట్రాలివే..!

అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట కల్పిస్తూ పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర సుంకం తగ్గిస్తున్నట్లు గత శనివారం

Published : 23 May 2022 14:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట కల్పిస్తూ పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర సుంకం తగ్గిస్తున్నట్లు గత శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ఇప్పుడు కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాలు ఈ ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

మహారాష్ట్ర..

లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.2500కోట్ల అదనపు భారం పడనుందని తెలిపింది.

రాజస్థాన్‌..

కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున వ్యాట్‌ను తగ్గించనున్నట్లు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ వెల్లడించారు. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.10.48, డీజిల్‌పై రూ7.16 తగ్గనుంది.

కేరళ..

కేరళ ప్రభుత్వం కూడా పెట్రో ఉత్పత్తులపై పన్ను తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాట్‌, ఇతర పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని