Recurring Deposit: ఆర్డీ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి..
ఒకటి నుంచి మూడు సంవత్సరాల స్వల్పకాల లక్ష్యాల కోసం ఆర్డీ ఖాతాను ఎంచుకోవొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక లక్ష్యాల సాధన కోసం సహాయపడే మార్గాలను ఎంచుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారు, నెలవారీగా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఎంచుకోవచ్చు. ఇది సురక్షితమైన మార్గం. మీ స్వల్పకాల ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సహాయపడుతుంది. ఆర్డీ ఖాతా టర్మ్ డిపాజిట్ మాదిరిగా పనిచేస్తుంది. ఎటువంటి నష్టభయం లేకుండా క్రమమైన డిపాజిట్లు చేస్తూ మంచి రాబడిని సాధించవచ్చు. ఆర్డీ ఖాతాను తెరిచేందుకు మీరు పోస్టాఫీసును గానీ, బ్యాంకులను గానీ సంప్రదించవచ్చు. రికరింగ్ డిపాజిట్ల నుంచి ఎక్కువ రాబడి పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలను ఇప్పుడు చూద్దాం..
సరైన బ్యాంకును ఎంచుకోండి..
ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని ప్రతి నెలా ఆర్డీ ఖాతకు జమ చేయాలి. బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ చేయాలంటే.. ఒక్కోసారి మర్చిపోవచ్చు లేదా కుదరకపోవచ్చు. కాబట్టి, పొదుపు ఖాతా నుంచి ఆర్డీ ఖాతాకు ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జమ చేసేలా బ్యాంకుకు సూచనలు ఇవ్వండి. దీని కోసం అవాంతరాలు లేకుండా సేవలను అందించే బ్యాంకును ఎంచుకోవడం అవసరం. రికరింగ్ డిపాజిట్ ఖాతా వడ్డీ రేట్లు, ఖాతా ఇతర నియమ నిబంధనలు, షరతులు పోల్చి చూడండి. బ్యాంకును అనుసరించి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మంచి వడ్డీ రేటును అందించే బ్యాంకును ఎంచుకోండి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు ఆర్డీ ఖాతాలపై 5.50% నుంచి 7.50% మధ్య వడ్డీని ఇస్తున్నాయి.
లక్ష్యాలకు అనుగుణంగా కాలవ్యవధి..
బ్యాంకులు సాధారణంగా కనీసం 6 లేదా 12 నెలల కాలపరిమితితో ఆర్డీ ఖాతాను ఇస్తాయి. గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. మీరు మీ ఆర్థిక లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కాలపరిమితిని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు పిల్లల ట్యూషన్ ఫీజు 12 నెలల్లో చెల్లించవలసి వస్తే, ఇదే కాలపరిమితితో ఎంచుకోవచ్చు. ఆర్డీ ఖాతా స్వల్పకాల అవసరాల కోసం అనుకూలంగా ఉంటుంది.
ఆర్డీ మొత్తం..
ప్రతి నెలా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆర్డీ ఖాతా ప్రారంభానికి ముందే నిర్ణయించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాన్ని బట్టి, మీరు నెల నెలా పొదుపు చేయగల మొత్తాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆర్డీ ఖాతాలో ప్రతి నెలా క్రమం తప్పకుండా డిపాజిట్ చేయాలి. కాబట్టి, ఎక్కువ మొత్తం ఎంచుకుంటే మీపై ఆర్థిక భారం పడొచ్చు. దీని ప్రభావం మీ ఇతర అవసరమైన ఖర్చులపై లేదా ఇతర పెట్టుబడులపై పడొచ్చు. అందువల్ల పెట్టుబడి మొత్తాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
ముందస్తు విత్‌డ్రాలు వద్దు..
మెచ్యూరిటి పీరియడ్ వరకు ఆర్డీ ఖాతాను కొనసాగించడం అవసరం. అన్ని బ్యాంకులూ ముందస్తు విత్‌డ్రాలను అనుమతించవు. ఒకవేళ అనుమతించినా ముందస్తు విత్‌డ్రాలపై పెనాల్టీ వర్తిస్తుంది. కొనసాగించిన కాలాన్ని బట్టి వడ్డీని లెక్కిస్తారు. అందువల్ల ఖాతా తెరిచే ముందే అధిక వడ్డీ రేటుతో పాటు ముందస్తు విత్‌డ్రాలపై తక్కువ పెనాల్టీ వసూలు చేసే బ్యాంకును ఎంచుకోవాలి.
ఒకవేళ మధ్యలోనే డిపాజిట్లను నిలిపివేస్తే, అప్పుడు కూడా బ్యాంకులు జరిమానా విధిస్తాయి. సాధారణంగా ఇచ్చే వడ్డీ కంటే 1 నుంచి 2 శాతం తక్కువ వడ్డీ ఇస్తాయి. దీంతో రాబడి తగ్గిపోతుంది. అలాగే ప్రతి నెలా నిర్ణీత సమయానికి డబ్బు డిపాజిట్ చేయకపోయినా పెనాల్టీ వర్తిస్తుంది. కాబట్టి ఖాతాను మధ్యలోనే నిలిపి వేయడం, ముందస్తు విత్‌డ్రాలు లాంటివి చేయకపోవడమే మంచిది.
ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్..
కొన్ని బ్యాంకులు ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. మెచ్యూరిటీ మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రతి నెలా రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని పెంచుకునే ఎంపికను అందిస్తున్నాయి. ఎంచుకున్న డిపాజిట్‌తో మీ లక్ష్యానికి తగినట్లుగా డబ్బు సమకూరనప్పుడు, ఇతర పెట్టుబడులపై ప్రభావం పడకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.
రుణ సౌకర్యం..
ఆర్డీ ఖాతాలో రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై 80 నుంచి 90 శాతం రుణం తీసుకోవచ్చు. అయితే, అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి.
నామినేషన్..
ఆర్డీ ఖాతాకు నామినేషన్ తప్పకుండా జోడించాలి. అనుకోకుండా ఖాతా తీసుకున్న వ్యక్తికి ఏమైనా జరిగితే నామినీకి సులభంగా డబ్బు చేరుతుంది.
చివరిగా..
ఆర్డీ ఖాతాకు ఎఫ్డీ మాదిరిగా ఒకేసారి డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. నెల నెలా జమ చేయవచ్చు. 1 నుంచి 3 సంవత్సరాల (ఇంటి రిపేర్లు, పిల్లల ట్యూషన్ ఫీజు, ప్రయాణం వంటివి) స్వల్పకాల లక్ష్యాలకు మాత్రమే ఆర్డీ అనుకూలంగా ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక ఎఫ్డీలను ప్రారంభించిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 9.25% వడ్డీ వరకు పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డును పరిమితికి మించి వాడుకోవచ్చా?
Credit Card: క్రెడిట్ వాడకంపై తరచూ ఎదురయ్యే కొన్ని కీలక సందేహాలకు ఇటీవల ఆర్బీఐ సమాధానాలు ఇచ్చింది. అవేంటో చూద్దాం..! -
వ్యక్తిగత రుణాలు మోసాల బారిన పడొద్దు
ఎలాంటి హామీ లేకుండా లభించే వ్యక్తిగత రుణాలు అవసరమైనప్పుడు ఎంతో ఉపయోగపడతాయి. మన అవసరాలను ఆసరాగా తీసుకొని, సైబర్ మోసగాళ్లు మన కష్టార్జితాన్ని కాజేసేందుకు సిద్ధంగా ఉంటారు. -
Gold Loans: బంగారు రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
సురక్షితమైన రుణం కాబట్టి బ్యాంకులు బంగారంపై సరసమైన వడ్డీ రేట్లకు వేగంగా రుణాలందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.. -
FD Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఇవే..
చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 1, 3, 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను ఇక్కడ చూడండి. -
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉండాలి?
వ్యక్తిగత ఆర్థిక విషయాల్లో పొదుపు ఖాతాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం చేసే ఆదాయ-వ్యయాలన్నింటికీ ఆధారం ఇదే. బ్యాంకు, మీరు ఎంచుకున్న ఖాతా రకాన్ని బట్టి, ఇందులో కనీస నిల్వ ఎంత ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. వేతనం ఖాతాలో సున్నా నిల్వ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. -
Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?
దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం. -
Credit Cards: హెచ్డీఎఫ్సీ నుంచి ఐదు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులు
Credit Cards: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇటీవల నాలుగు కొత్త బిజినెస్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాటి ఫీచర్లు, జాయినింగ్ ఫీజు, అర్హతల వంటి వివరాలను చూద్దాం.. -
Two wheeler insurance: బైక్ ఇన్సూరెన్స్.. ఇవన్నీ తెలుసుకున్నాకే..!
Two wheeler insurance: మీ టూవీలర్‌కు బీమా చేయించాలని చూస్తున్నారా? మంచి పాలసీ తెలుసుకోలేకపోతున్నారా? ఈ కింది విషయాలపై ఓ లుక్కేయండి. -
గృహరుణం ఇప్పుడేం చేయాలి?
ఏడాది కాలంగా రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోంది. దీన్ని పెంచకపోవడం మంచి పరిణామమే. అదే సమయంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేట్లను తగ్గించేంతగా సహకరించడం లేదు. -
కార్పొరేట్ బాండ్లు ఎంచుకోండి జాగ్రత్తగా
మన దేశంలో అత్యంత సురక్షితమైన, ప్రజాదరణ పొందిన పొదుపు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ముందుంటాయి. నిర్ణీత కాలానికి, స్థిరమైన వడ్డీని అందించే వీటిని చాలామంది ఇష్టపడతారు. -
Saving Account: పొదుపు ఖాతా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
బ్యాంకులో పొదుపు ఖాతా అనేది ఖాతాదారుడికి ఒక విభిన్నమైన ఆర్థిక సాధనం. ఇది ఖాతాదారుడికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. -
Fixed Deposits: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన ఐసీఐసీఐ
ఐసీఐసీఐ బ్యాంకు ఎంపిక చేసిన కొన్ని కాలవ్యవధుల ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 7.75% వడ్డీని పొందుతారు. -
కారు రుణంపై టాపప్
మీకు ఇప్పటికే కారు రుణం ఉందా? అత్యవసరంగా డబ్బు కావాలా? కారు రుణంపై టాపప్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మంచి రుణ చరిత్ర ఉన్న వారికి బ్యాంకులు సులభంగానే ఈ టాపప్‌ను అందిస్తాయి. -
Emergency Loan: అత్యవసరంగా డబ్బు అవసరం పడినప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటి?
చాలా మందికి అత్యవసరంగా నగదు అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు మెరుగైన క్రెడిట్ స్కోరున్నా, కొన్ని కేటగిరీల ఆస్తులున్నా సరే వేగంగా రుణం పొందొచ్చు. -
Credit Card: క్రెడిట్ కార్డు కనీస మొత్తం చెల్లిస్తుంటే
క్రెడిట్ కార్డు బిల్లును మొత్తం ఒకేసారి చెల్లించాలి. కొన్నిసార్లు చేతిలో డబ్బు లేకపోతే.. కనీస మొత్తం మనల్ని ఆకర్షిస్తుంటుంది. -
HDFC bank: రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
HDFC bank latest Interest rates: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. వివిధ కాలవ్యవధులకు సంబంధించిన ఎంసీఎల్ఆర్ను పెంచింది. -
FD rates: ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంకు ఎంపిక చేసిన కాలవ్యవధి ఎఫ్డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. -
Fixed Deposits: కార్పొరేట్ సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఎఫ్డీ రేట్లు ఇవే..
'AAA' రేటింగ్ ఉన్న కార్పొరేట్ సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. -
క్రెడిట్ కార్డు.. ఇలా వాడుదాం
ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. క్రెడిట్ కార్డుల వినియోగదారులను ఆకర్షించేది ఇదే. వెసులుబాటు ఉంది కదా అని అవసరానికి మించి వాడితే అప్పుల ఊబిలోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది. -
Home Loans: గృహ రుణాలపై లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..!
బ్యాంకులు ఇతర రుణాలకంటే కూడా ఇంటి రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను వసూలు చేస్తుంటాయి. వివిధ బ్యాంకులు వసూలుజేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్‌రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్‌కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్