Updated : 25 May 2022 11:44 IST

SpiceJet: ర్యాన్‌సమ్‌వేర్‌ దాడి.. స్పైస్‌జెట్‌ సేవలకు అంతరాయం

ముంబయి: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ విమాన సేవలు బుధవారం ఉదయం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు చేసిన సైబర్ దాడి వల్లే ఇది జరిగిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ర్యాన్‌సమ్‌వేర్‌ మాల్వేర్‌ దాడి వల్ల తమ వెబ్‌సైట్లలో అంతరాయం ఏర్పడిందని వివరించింది. దీని వల్లే విమానాలు ఆలస్యంగా బయలుదేరాయని తెలిపింది.

తమ ఐటీ బృందం సమస్యను గుర్తించి పరిష్కరించిందని స్పైస్‌జెట్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం విమానాలు యథావిధిగా నడుస్తున్నాయని బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో వెల్లడించింది. అయితే, ప్రయాణికులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. గంటల తరబడి విమానాశ్రయాల్లో వేచి చూడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. సేవల్లో నాణ్యత లేదని.. ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం తప్పని అభిప్రాయపడ్డారు. 

ర్యాన్‌సమ్‌వేర్‌ అనేది ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం కలిగించే ఒకరకమైన మాల్వేర్‌. సైబర్‌ నేరగాళ్లు అనుమతి లేకుండా సైట్లోకి ప్రవేశించి కీలక సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి లాక్‌ చేస్తారు. వాటిని డీక్రిప్ట్‌ చేసి అన్‌లాక్‌ చేయడానికి కొంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని