Sri Lanka Crisis: వచ్చేవారం శ్రీలంక స్టాక్‌ మార్కెట్లు బంద్‌

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో వచ్చే వారం స్టాక్‌ మార్కెట్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి....

Updated : 16 Apr 2022 14:12 IST

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో వచ్చే వారం స్టాక్‌ మార్కెట్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని మదుపర్లు ఆకళింపు చేసుకునేందుకు సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీలంక సెక్యూరిటీస్‌ కమిషన్‌.. కొలంబో స్టాక్‌ ఎక్స్ఛేంజీకి తెలిపింది. తాజా పరిస్థితులు మార్కెట్లపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయనే అంశంపై సమగ్రంగా విశ్లేషించామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 18 నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఐదు రోజుల పాటు శ్రీలంక స్టాక్ ఎక్స్ఛేంజీ పనిచేయడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని