Credit Card: ఎక్కువ‌గా ప్ర‌యాణాలు చేస్తుంటారా?అయితే ఈ కొత్త క్రెడిట్ కార్డు మీ కోస‌మే..!

కార్డు సభ్యులు..'ఈజ్‌మైట్రిప్' వెబ్‌సైట్/మొబైల్ అప్లికేషన్‌లో విమానాలు, హోటల్ బుకింగ్‌పై ఏడాది పొడవునా తక్షణ తగ్గింపు ప్రయోజనాలకు పొంద‌వ‌చ్చు.

Updated : 20 Jul 2022 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఈజ్‌ మైట్రిప్‌తో క‌లిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ట్రావెల్ టెక్ ఫ్లాట్‌ఫారమ్స్‌లో ఈజ్‌ మైట్రిప్ రెండో అతిపెద్ద ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం. ఈజ్‌ మైట్రిప్ స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్  క్రెడిట్ కార్డు.. తమ స‌భ్యుల‌కు త‌క్ష‌ణ డిస్కౌంట్లు, రివార్డు పాయింట్ల‌తో పాటు ప్ర‌త్యేక ప్ర‌యాణ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

ఈజ్‌మైట్రిప్ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్‌లో చేసే దేశీయ, అంతర్జాతీయ హోటల్ బుకింగ్‌లపై ఫ్లాట్ 20 శాతం, విమాన బుకింగ్‌లపై 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అలాగే, నిర్దిష్ట‌ ఎయిర్‌లైన్స్, హోట‌ల్ వెబ్‌సైట్‌లు/యాప్‌ల నుంచి చేసే బుకింగ్స్‌పైనా.. అద‌న‌పు రివార్డు పాయింట్ల‌ను పొందొచ్చు. ఈ రివార్డు పాయింట్లు స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ బ్యాంక్ రివార్డ్ కేటలాగ్ (వెబ్‌సైట్‌/యాప్‌)లో అందుబాటులో ఉన్న‌ ఈజ్‌ మైట్రిప్‌ స‌హా ప‌లు బ్రాండ్‌ల‌లో రీడీమ్ చేసుకోవ‌చ్చు. కార్డు స‌భ్యులు ఈజ్‌మైట్రిప్ కాలానుగుణంగా ఇచ్చే ప్ర‌మోష‌న‌ల్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్‌ల‌ను కూడా ఆస్వాదించ‌వ‌చ్చు.

ఫీచ‌ర్లు..

  • దేశీయ హోట‌ల్ బుకింగ్‌ల‌పై రూ. 5000 వ‌ర‌కు, అంతర్జాతీయ హోటల్ బుకింగ్‌లపై రూ. 10,000 వ‌ర‌కు ఫ్లాట్ 20 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ ల‌భిస్తుంది. బుకింగ్‌పై క‌నీస ప‌రిమితి లేదు.
  • దేశీయ విమాన ప్ర‌యాణాల‌ బుకింగ్‌ల‌పై రూ.1000 వ‌ర‌కు, అంతర్జాతీయ విమాన ప్ర‌యాణాల కోసం చేసే బుకింగ్‌ల‌పై రూ.5,000 వ‌ర‌కు ఫ్లాట్ 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ ల‌భిస్తుంది. బుకింగ్‌పై క‌నీస ప‌రిమితి లేదు.
  • దేశీయ బ‌స్ బుకింగ్‌ల‌పై రూ. 125 ఫ్లాట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అయితే టికెట్ల‌ కోసం చెల్లించే క‌నీస మొత్తం రూ. 500 లేదా అంత‌కు మించి ఉండాలి.
  • ఎంపిక చేసిన వ్యాపారుల వ‌ద్ద (నిర్దిష్ట‌ ఎయిర్‌లైన్స్, హోట‌ల్ వెబ్‌సైట్‌/ యాప్‌/ అవుట్‌లెట్) ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూ.100కి 10 రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి.
  • దేశీయంగా ఎంపిక చేసిన వ్యాపారుల వ‌ద్ద కాకుండా వీసా కార్డులు అనుమ‌తించే ఇత‌ర వ్యాపారుల వ‌ద్ద ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూ.100పై 2 రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి.
  • ప్ర‌తి క్యాలెండర్ త్రైమాసికంలో ఒక‌సారి డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, రెండుసార్లు అంత‌ర్జాతీయ లాంజ్‌ యాక్సెస్‌లు కాంప్లిమెంట‌రీగా ల‌భిస్తాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని