Health Insurance: మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక ఆరోగ్య బీమాను లాంచ్ చేసిన స్టార్ హెల్త్‌

పాల‌సీ పొందేందుకు మ‌హిళ‌లు ఎలాంటి ముంద‌స్తు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోన‌వ‌స‌రం లేదు.

Updated : 08 Mar 2022 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్..  స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. ఇది మ‌హిళ‌ల కోసం ప్రవేశపెట్టిన సమగ్రమైన హెల్త్ క‌వ‌ర్‌. మహిళ‌ల జీవిత కాలంలో ప్ర‌తి ద‌శ‌లోనూ ఎదుర‌య్యే ఆరోగ్య అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ పాల‌సీని ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ట్లు సంస్థ తెలిపింది.

నేటి స‌మాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కుటుంబ పోషణలో వారి సహకారం మరువలేనిది అనడంలో సందేహం లేదు. మ‌హిళ‌లు త‌మ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌తో పాటు పిల్ల‌లు, కుటుంబ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌ం ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్య‌క్తిగ‌తంగానే కాకుండా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ విధానంలోనూ పాల‌సీని అందుబాటులో ఉంచిన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. సంస్థ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స్టార్ విమెన్ కేర్ పాల‌సీని 18 నుంచి 75 సంవ‌త్స‌రాల్లోపు మ‌హిళ‌లు తీసుకోవ‌చ్చు. పాల‌సీ పొందేందుకు మ‌హిళ‌లు ఎలాంటి ముంద‌స్తు వైద్య ప‌రీక్ష‌లూ చేయించుకోన‌వ‌స‌రం లేదు. త్రైమాసిక‌ (మూడు నెల‌లు), అర్ధ‌మాసిక (ఆరు నెల‌లు) చెల్లింపు ఆప్ష‌న్‌తో 1,2,3 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధితో పాల‌సీ అందుబాటులో ఉంది.

రెగ్యులర్ హాస్పిటలైజేషన్‌తో పాటు, రీ ప్రొడ‌క్ష‌న్ చికిత్స‌, ప్రసవానికి ముందు, త‌ర్వాత, బహుళ వైద్య సంప్రదింపులు, నివారణ ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛంద స్టెరిలైజేషన్, అలాగే పిల్లల ఆసుపత్రి ఖ‌ర్చులను పాల‌సీ కవర్ చేస్తుంది. మ‌హిళ‌లు గ‌ర్భ‌దార‌ణ స‌మ‌యంలోనూ ఈ పాల‌సీని తీసుకోవ‌చ్చు. గర్భధారణ సంరక్షణ చికిత్స, గర్భాశయంలోని పిండం శస్త్రచికిత్సలు, న‌వ‌జాత శిశువు ఆసుప్ర‌తి ఖ‌ర్చులు, టీకాలు, శిశువైద్యుడి సంప్ర‌దింపుల‌కు అయ్యే ఖ‌ర్చులను నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పాల‌సీ క‌వ‌ర్ చేస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ‌కు మొద‌టి రోజు నుంచి పాల‌సీ క‌వ‌రేజ్ మొత్తంలో 25 శాతం వ‌ర‌కు బీమా వ‌ర్తిస్తుంది. త‌ర్వాతి ఏడాది నుంచి 100 శాతం బీమా వ‌ర్తిస్తుంది. పిల్ల‌లు 12 సంవ‌త్స‌రాలలోపు ఆసుప‌త్రి ఐసీయూలో చేరాల్సి వ‌స్తే, త‌ల్లికి అదే ఆసుప‌త్రిలో ఉండేందుకు గ‌ది అద్దెను చెల్లిస్తారు.

స్టార్ విమెన్ కేర్ బీమా పాల‌సీ ఇత‌ర ముఖ్య ఫీచ‌ర్లు..

  • రూ.1 కోటి హామీ మొత్తం వరకు పాల‌సీ తీసుకునే వీలుంది. వినియోగదారులు రూ.5 ల‌క్ష‌లు, రూ. 10 ల‌క్ష‌లు, రూ.15 ల‌క్ష‌లు, రూ.25 ల‌క్ష‌లు, రూ.50 ల‌క్ష‌ల హ‌మీతో కూడిన పాల‌సీని ఎంచుకోవ‌చ్చు.
  • వ్య‌క్తిగ‌త పాలసీ.. 18 నుంచి 75 సంవ‌త్స‌రాలు ఉన్న మ‌హిళ‌లకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.
  • ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాలసీ 18 నుంచి 75 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉన్న ఒక్క‌ మ‌హిళ కుటుంబంలో ఉన్నా తీసుకోవ‌చ్చు. జీవిత‌ భాగ‌స్వామి, ఆధారిత పిల్ల‌ల‌కు పాల‌సీ వ‌ర్తిస్తుంది.
  • క‌వ‌రేజ్‌.. ఇన్-పేషెంట్ ఆసుప‌త్రి ఖ‌ర్చులు, ప్రసవం, డే-కేర్ చికిత్స‌, రోడ్ అంబులెన్స్‌, ఎయిర్ అంబులెన్స్‌, అవ‌య‌వ మార్పిడి ఖ‌ర్చులు, ఆసుప్ర‌తిలో చేర‌క ముందు, చేరిన త‌ర్వాత అయ్యే ఖ‌ర్చులు పాల‌సీలో క‌వ‌ర‌వుతాయి. 
  • కేన్స‌ర్ నిర్ధార‌ణ అయితే హామీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.
  • మొదటి రోజు నుంచే ఔట్ పేషెంట్ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.
  • 100 శాతం ఆటోమేటిక్ రీస్టోరేష‌న్ ఉంది. 
  • www.starhealth.in ద్వారా ఆన్‌లైన్‌లో పాల‌సీని కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు పొందొచ్చు. పాల‌సీ కొనుగోలు, పున‌రుద్ధ‌ర‌ణ‌పై ఈ త‌గ్గింపులు పొందే వీలుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని