Stellantis: సిట్రొయెన్‌తో విద్యుత్తు వాహన విభాగంలోకి స్టెలాంటిస్‌

ప్రముఖ అంతర్జాతీయ వాహన తయారీ సంస్థ స్టెలాంటిస్‌ భారత్‌లో రంగప్రవేశానికి సిద్ధమవుతోంది....

Published : 18 May 2022 18:52 IST

చెన్నై: ప్రముఖ అంతర్జాతీయ వాహన తయారీ సంస్థ స్టెలాంటిస్‌ భారత్‌లో రంగప్రవేశానికి సిద్ధమవుతోంది. తొలుత విద్యుత్తు వాహనాన్ని సిట్రొయెన్ బ్రాండ్‌ పేరిట విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం దీని ఆవిష్కరణ ఉంటుందని కంపెనీ గ్లోబల్‌ సీఈఓ కార్లోస్‌ టవేర్స్‌ తెలిపారు.

ఫియట్‌ క్రిస్టర్‌ ఆటోమొబైల్స్‌, పీఎస్‌ఏ గ్రూప్‌ కలిసి స్టెలాంటిస్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే. భారత్‌లో జీప్‌, సిట్రొయెన్‌ బ్రాండ్ల పేరిట ఈ గ్రూపు వాహనాలను విక్రయిస్తోంది. అయితే, విద్యుత్తు వాహనాలను మాత్రం సిట్రొయెన్‌ పేరిటే తీసుకొస్తామని స్పష్టం చేసింది. కాంపాక్ట్‌, మల్టీపర్పస్‌ యుటిలిటీ వెహికల్‌ విభాగంలో వాహనాలను తీసుకురానుంది. 2030 నాటికి భారత్‌లో తమ విక్రయాల్లో 30 శాతం వాటా విద్యుత్తు వాహనాలదే ఉంటుందని పేర్కొంది. అయితే, భవిష్యత్తులో దేశీయ విపణిలో రానున్న మార్పులు దీనికి కీలకం కానున్నాయంది.

భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా పెట్టుబడులేమీ కేటాయించలేదని కార్లోస్‌ తెలిపారు. కార్ల ధరల్లో దాదాపు 40 శాతం వాటా బ్యాటరీలదేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ వినియోగదారులకు ధరల్ని అందుబాటులో ఉంచేలా.. స్థానికంగానే బ్యాటరీలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని