Interest Rates: ఎఫ్‌డీలపై శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఆకర్షణీయ వడ్డీ

STFC అనేది 42 ఏళ్ల కంపెనీ, ఇది శ్రీ‌రామ్ గ్రూప్‌లో భాగం.

Updated : 09 Aug 2022 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీరామ్ గ్రూప్‌లో భాగ‌మైన శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (STFC) త‌న కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల‌ను 25 నుంచి 50 బేసిస్ పాయింట్ల వర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 2022 ఆగ‌స్టు 10 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సాధార‌ణ డిపాజిట‌ర్లు 8.25% వ‌ర‌కు వ‌డ్డీని పొంద‌వ‌చ్చ‌ని STFC ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే, 60 నెల‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై మాత్ర‌మే 8.25% వ‌డ్డీ ల‌భిస్తుంది.

STFC సీనియ‌ర్ సిటిజ‌న్ డిపాజిటర్ల‌కు 0.5% అద‌న‌పు వ‌డ్డీని అందిస్తుంది. అంటే, సీనియ‌ర్ సిటిజ‌న్లు 5 సంవ‌త్స‌రాల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.75% వ‌డ్డీని పొందొచ్చు. ఒక సంవ‌త్స‌రం ఎఫ్‌డీకి స‌వ‌రించిన వ‌డ్డీ రేటు ప్ర‌కారం 6.75%, రెండేళ్ల ఎఫ్‌డీకి 7.25% వ‌డ్డీ రేటును అందిస్తోంది. 3, 4 సంవ‌త్స‌రాల ఎఫ్‌డీల‌కు వ‌రుస‌గా 8%, 8.15% వడ్డీ రేటును అందిస్తోంది. డిపాజిట్ రెన్యూవ‌ల్స్‌పై సంవ‌త్స‌రానికి అద‌నంగా 0.25% వ‌డ్డీ చెల్లిస్తారని కంపెనీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

నోట్‌: STFC లాంటి ఎన్‌బీఎఫ్‌సీలు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లు సాధార‌ణ బ్యాంకులు అందించే ప్ర‌యోజ‌నంతో రావు. బ్యాంకుల విష‌యానికొస్తే రూ.5 ల‌క్ష‌ల డిపాజిట్ వ‌ర‌కు బీమా హామీ ఉంటుంది. అంటే బ్యాంకు విఫ‌లం అయిన‌ప్పుడు కూడా డిపాజిటర్లు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు తిరిగి పొందుతారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్‌ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌక‌ర్యం బ్యాంకుల మాదిరిగా ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట‌ర్ల‌కు ఉండ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని