Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: సెన్సెక్స్ (Sensex) 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 46.35 పాయింట్లు లాభపడి 18,534.10 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలకు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఉదయం సెన్సెక్స్ (Sensex) 62,601.97 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,719.84- 62,379.86 మధ్య కదలాడింది. చివరకు 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,550.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,573.70- 18,478.40 మధ్య ట్రేడైంది. చివరకు 46.35 పాయింట్లు లాభపడి 18,534.10 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో టాటా స్టీల్, మారుతీ, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్‌లోని ఇతర విషయాలు..
☛ అదనపు టైర్-1, టైర్-2 బాండ్ల ద్వారా 2024 మార్చి 31 నాటికి రూ.5,000 కోట్లు సమీకరించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా బోర్డు ఆమోదం తెలిపింది. బ్యాంకు షేరు విలువ ఈరోజు దాదాపు 1 శాతం లాభపడి రూ.186.60 దగ్గర స్థిరపడింది.
☛ తాష్కెంట్, నైరోబీ సహా ఆఫ్రికా, సెంట్రల్ ఏషియాలోని ఆరు కొత్త ప్రాంతాలకు నేరుగా విమానాలను నడపనున్నట్లు ఇండిగో తెలిపింది. ఈ ఏడాదిలోనే సేవలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. కంపెనీ షేరు ఈరోజు 1.50 శాతం పుంజుకొని రూ.2,379 దగ్గర నిలిచింది.
☛ హోం రెంటల్ ప్లాట్‌ఫాం నెస్ట్‌అవేను రూ.90 కోట్లకు ఆరమ్ ప్రాప్‌టెక్ పూర్తిగా కొనుగోలు చేయనుంది. ఈరోజు ఆరమ్ ప్రాప్‌టెక్ షేరు విలువ 7.91 శాతం పెరిగి రూ.126.80 దగ్గర ముగిసింది.
☛ బలమైన మార్చి త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మ్యాన్‌కైండ్ ఫార్మా షేరు గత మూడు రోజులుగా రాణిస్తోంది. ఈ వ్యవధిలో స్టాక్ 11 శాతానికి పైగా పెరిగింది. ఈరోజు షేరు విలువ 4.99 శాతం పెరిగి రూ.1,465 దగ్గర స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్‌పోల్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్