Stock Market: భారీగా పతనమవుతున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1100 పాయింట్లు డౌన్‌

దేశీయ మార్కెట్లు గురువారం భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి

Published : 12 May 2022 14:00 IST

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి దిగ్గజ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను కుదిపేస్తున్నాయి. దీంతో మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1100 పాయింట్లకు పైగా కుంగిపోగా.. నిఫ్టీ 350 పాయింట్లకు పైగా పడింది.

మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1121 పాయింట్లు పతనమై 52,952 వద్ద, నిఫ్టీ 355 పాయింట్ల నష్టంతో 15,815 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీలు 2 శాతానికి పైగా పతనమయ్యాయి. లోహ, విద్యుత్‌, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ సూచీలు 2-3శాతం వరకు కుంగాయి.

అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలను చవిచూశాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగానే పడింది. అటు ఆసియా మార్కెట్లు కూడా నేటి ఉదయం బలహీనంగానే ప్రారంభమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని