Stock Market: ఆర్‌బీఐ ప్రకటనకు ముందు సూచీల్లో అప్రమత్తత!
Stock Market: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 50 పాయింట్ల లాభంతో 63,193 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 14 పాయింట్ల లాభంతో 18,741 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. రేట్ల పెంపుపై ఆర్‌బీఐ నుంచి మరికాసేపట్లో కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆరంభంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 50 పాయింట్ల లాభంతో 63,193 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 14 పాయింట్ల లాభంతో 18,741 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.59 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, మారుతీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఏప్రిల్‌లో యూఎస్ వాణిజ్య లోటు ఆరు నెలల గరిష్ఠానికి చేరింది. ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ కెనడా వడ్డీరేట్లను పెంచింది. దీంతో అమెరికా సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉందన్న అంచనాలు బలపడ్డాయి. నేడు ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్నాయి. వడ్డీరేట్ల పెంపుపై కేంద్ర బ్యాంకు ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై మదుపర్లు ప్రధానంగా దృష్టి సారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బాబుకు మద్దతుగా ఉత్తరాల ప్రవాహం
-
Chandrababu: హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం
-
మనిషికి పంది గుండె.. రెండోరోజుకే చలోక్తులతో హుషారుగా ఉన్న రోగి!
-
రైలు పట్టాల కింద గుంత.. బాలుడి చొరవతో తప్పిన ప్రమాదం
-
పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దు: నాగబాబు
-
కాలవ శ్రీనివాసులు దీక్ష భగ్నం