Stock Market Update: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. వరుస ఆరు సెషన్ల నష్టాల నుంచి సోమవారం బ్రేక్‌ తీసుకున్న మార్కెట్లు తిరిగి మందకొడి ధోరణిలోకి ప్రవేశించాయి....

Updated : 17 May 2022 09:35 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస ఆరు సెషన్ల నష్టాల నుంచి సోమవారం బ్రేక్‌ తీసుకున్న మార్కెట్లు నేటి ఉదయం ట్రేడింగ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం స్వల్ప లాభాల్లో ట్రేడువుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్ల కారణంగా ఏప్రిల్‌లో చైనాలో పారిశ్రామిక, ఉత్పత్తి కార్యకలాపాలు నెమ్మదించినట్లు గణాంకాలు వెల్లడించాయి. నేడు ఎల్‌ఐసీ ఐపీఓ షేర్లు ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. మదుపర్లు ప్రధానంగా దీనిపై దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 373 పాయింట్ల లాభంతో 53,347 వద్ద, నిఫ్టీ (Nifty) 115 పాయింట్లు లాభపడి 15,957 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.72 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఐటీసీ  షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: భారతీ ఎయిర్‌టెల్‌, ఐఓసీ, డీఎల్‌ఎఫ్‌, పీఐ ఇండస్ట్రీస్‌, అబోట్‌ ఇండియా, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బజాజ్‌ హెల్త్‌కేర్‌, ఈఐడీ పారీ(ఇండియా), ఇండొకో రెమిడీస్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌, జుబిలంట్‌ ఇన్‌గ్రీవ, కజారియా సిరామిక్స్‌, డాక్టర్‌ లాల్‌ పాత్‌ల్యాబ్స్‌, మిందా కార్పొరేషన్‌, సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా, ఫెయిర్‌కెమ్‌ ఆర్గానిక్స్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని