Updated : 27 May 2022 15:22 IST

Stock Market Update: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అక్కడి టెక్‌ స్టాక్‌లలో కొనుగోళ్లు వెల్లువెత్తడం మార్కెట్లకు కలిసొచ్చింది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడుతుండడం మన సూచీలకు కలిసొచ్చే అంశం. అయితే, చమురు ధరలు పెరగడం మాత్రం మదుపర్లను కలవరపెడుతోంది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు సైతం నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 499 పాయింట్ల లాభంతో 54,751 వద్ద, నిఫ్టీ (Nifty) 149 పాయింట్లు లాభపడి 16,319 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.59 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో చలిస్తున్నాయి. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈ-కామర్స్‌ వెంచర్స్‌ (నైకా), జుబిలంట్‌ ఫార్మా, గెయిల్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, పీబీ ఫిన్‌టెక్‌ (పాలసీబజార్‌)

నేడు గమనించాల్సిన స్టాక్‌లు..

పారాదీప్‌ పాస్ఫేట్స్‌: దేశంలో రెండో అతిపెద్ద యూరియాయేతర ఎరువులు, డీఏపీ తయారీ సంస్థ పారాదీప్‌ పాస్ఫేట్స్‌ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

బీపీసీఎల్‌: ప్రభుత్వం ఈ కంపెనీ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

హిందాల్కో ఇండస్ట్రీస్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన రెండింతలై రూ.3,851 కోట్లకు చేరింది.

వేదాంత: హిందూస్థాన్‌ జింక్‌లోని వాటాల్లో దాదాపు 86.1 శాతాన్ని ప్లెడ్జ్‌కు పెట్టడం గమనార్హం. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ వాటా గణనీయంగా పెరిగింది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజ్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.181.93 కోట్లుగా నివేదించింది. క్రితం ఏడాది ఇది రూ.272.36 కోట్లుగా నమోదైంది.

హెచ్‌డీఎఫ్‌సీ: హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌లోని తమ వాటాల్లో 10 శాతాన్ని అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీకి విక్రయించినట్లు వెల్లడించింది.

ఓఎన్‌జీసీ: వచ్చే మూడేళ్లపాటు ఇంధన అన్వేషణ కోసం రూ.31,000 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని