Stock Market Update: ఊగిసలాటలో దేశీయ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ ఊగిసలాట ధోరణిలో పయనిస్తున్నాయి....

Updated : 24 May 2022 09:46 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ ఊగిసలాట ధోరణిలో పయనిస్తున్నాయి. ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు లాభనష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. కానీ, ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో చలిస్తున్నాయి. దీంతో అమెరికా మార్కెట్ల లాభాల జోష్‌ ఆసియా-పసిఫిక్‌ సూచీల్లో ఏమాత్రం కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల్లో చిక్కుకున్న మార్కెట్లకు కొత్తగా ఎలాంటి ఆశాజనక పరిణామాలు జత కావడం లేదు. ఫలితంగా మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే ట్రేడవుతూ లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు.. గరిష్ఠాల వద్ద అమ్మకాల వ్యూహంతో మదుపర్లు ముందుకు సాగుతున్నారు. మరోవైపు తైవాన్‌పై, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై బైడెన్ చేసిన వ్యాఖ్యలు.. బదులుగా వచ్చిన సమాధానాల వంటి భౌగోళిక రాజకీయ పరిణామాలూ సూచీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 157 పాయింట్ల నష్టంతో 54,131 వద్ద, నిఫ్టీ (Nifty) 54 పాయింట్లు నష్టపోయి 16,160 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.55 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హెచ్‌యూఎల్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ భారీగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పోర్ట్స్‌, జేఎం ఫైనాన్షియల్‌, క్లారియంట్‌ కెమికల్స్‌, యుగ్రో క్యాపిటల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఈక్లెర్క్స్‌ సర్వీసెస్‌, ఇప్‌కా లేబోరేటరీస్‌, లేటెంట్‌వ్యూ అనలిటిక్స్‌, జ్యోతి ల్యా్బ్స్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌, మిందా ఇండస్ట్రీస్‌, ఎంటార్‌ టెక్నాలజీస్‌, ఎన్‌ఐఐటీ నేషనల్‌ ఫర్టిలైజర్స్‌, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, శ్రీరేణుక షుగర్స్‌, రైట్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని