Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,500 దాటిన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 192 పాయింట్లు పెరిగి 77,185 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకొని 23,522 దగ్గర కొనసాగుతోంది.

Updated : 18 Jun 2024 09:43 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 192 పాయింట్లు పెరిగి 77,185 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకొని 23,522 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ తొలిసారి 23,500 మైలురాయిని దాటడం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52 వద్ద ప్రారంభమైంది.  

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో విప్రో, ఎం అండ్‌ ఎం, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మారుతీ, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

మే నెలకు సంబంధించి రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న తరుణంలో అమెరికా మార్కెట్లు (Stock Market) సోమవారం లాభాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సానుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 84.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.2,176 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.655 కోట్ల వాటాలను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని