Stock Market: అంతర్జాతీయ ప్రతికూలతల్లోనూ లాభాల్లో దేశీయ సూచీలు!
Stock Market: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 353 పాయింట్ల లాభంతో 59,488 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 106 పాయింట్లు లాభపడి 17,519 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: ఎస్‌వీబీ పతనం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అయినప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మాత్రం నేటి ట్రేడింగ్ ఆరంభంలో సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే, ఆ లాభాలు ఎంతవరకు నిలబడతాయన్నది చూడాల్సి ఉంది! ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 353 పాయింట్ల లాభంతో 59,488 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 106 పాయింట్లు లాభపడి 17,519 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.80 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, విప్రో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టైటన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఎస్‌వీబీ (సిలికాన్ వ్యాలీ బ్యాంక్) ఉదంతం అక్కడి మార్కెట్లలో తీవ్ర కలవరాన్ని నింపింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు మెజారిటీ స్టార్టప్‌లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఆసియా- పసిఫిక్ సూచీలు సైతం నేడు ప్రతికూలంగానే ట్రేడవుతున్నాయి.
గమనించాల్సిన స్టాక్స్..
యెస్ బ్యాంక్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మూడేళ్ల లాకిన్ గడువు నేటితో (సోమవారం) ముగుస్తున్నందున, వ్యక్తిగత మదుపర్లతో పాటు ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్‌ల) నుంచి యెస్ బ్యాంక్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నజారా టెక్నాలజీస్: తమ 2 అనుబంధ సంస్థలు కిడోపియా, మీడియా వర్క్స్‌లకు చెందిన రూ.64 కోట్ల నగదు నిల్వలు ఎస్‌వీబీలో ఉన్నాయని దేశీయ గేమింగ్ మీడియా ప్లాట్‌ఫామ్ నజారా టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. అయితే తమ గ్రూప్ సంస్థల వద్ద మరో రూ.600 కోట్ల నగదు నిల్వలున్నందున కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదని స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్ షేర్లు: షేర్లను తనఖా పెట్టి తెచ్చిన రుణాలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు అదానీ గ్రూప్ ప్రమోటర్లు వెల్లడించారు.
హెచ్‌ఏఎల్: భారత వాయుసేనకు కావాల్సిన ఆరు డోర్నియర్-228 విమానాలను హెచ్‌ఏఎల్ నుంచి రక్షణశాఖ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ రూ.667 కోట్లు.
మహీంద్రా అండ్ మహీంద్రా: వాహన పరికరాల సరఫరా సంస్థ మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్ లిమిటెడ్‌లో 4.6 శాతం వాటాను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించాలని మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Sports News
భారత్‌తో బంధం ప్రత్యేకమైంది: ఏబీ డివిలియర్స్
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు