Stock Market: నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 18,300 దిగువకు నిఫ్టీ

Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 211 పాయింట్ల నష్టంతో 61,770 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 72 పాయింట్లు నష్టపోయి 18,275 దగ్గర కొనసాగుతోంది.

Updated : 24 May 2023 09:39 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 211 పాయింట్ల నష్టంతో 61,770 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 72 పాయింట్లు నష్టపోయి 18,275 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు పతనమై 82.83 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. కానీ, తర్వాత యూఎస్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లోకి జారుకున్నాయి. ఐరోపా మార్కెట్లు గత రాత్రి నష్టాలు చవిచూశాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు ట్రేడింగ్‌ను ప్రతికూలంగా ప్రారంభించాయి. బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 1.5 శాతం పెరిగి 77.13 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు బుధవారం రూ.182.51 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.397.29 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

అమరరాజా బ్యాటరీస్‌: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.2,429 కోట్ల ఆదాయాన్ని, రూ.191 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.2,180 కోట్లు, పన్నుకు ముందు లాభం రూ.132  కోట్లు ఉన్నాయి.

కావేరీ సీడ్‌: జనవరి- మార్చిలో రూ.60.64 కోట్ల ఆదాయంపై రూ.13.89 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.59.44 కోట్లు కాగా, అప్పట్లో రూ.13.09 కోట్ల నికర నష్టం ఉంది.

ఎన్‌ఎండీసీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,851 కోట్ల టర్నోవరును, రూ.2,277 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి టర్నోవరు రూ.17,667 కోట్లు, నికరలాభం రూ.5,529 కోట్లు ఉన్నాయి.

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: ప్రైవేటు రంగ విద్యుదుత్పత్తి సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.272 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.864 కోట్లతో పోలిస్తే ఇది 68 శాతం తక్కువ. అయితే గత ఏడాది జల విద్యుత్‌ నియంత్రణ సర్దుబాటు కింద రూ.492 కోట్లు లభించడంతో లాభం భారీగా నమోదైందని, ఈ త్రైమాసిక ఫలితాలతో వాటిని పోల్చి చూడొద్దని కంపెనీ తెలిపింది.

అశోక్‌ లేలాండ్‌: 2022-23 మార్చి త్రైమాసికంలో అశోక్‌ లేలాండ్‌ రూ.802.71 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.157.85 కోట్లతో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.9,926.97 కోట్ల నుంచి రూ.13,202.55 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని