Stock Market: మార్కెట్లలో జోష్‌.. 18,600 పైన నిఫ్టీ

Stock Market: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 335 పాయింట్ల లాభంతో 62,882 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 92 పాయింట్ల లాభంతో 18,626 దగ్గర కొనసాగుతోంది.

Published : 05 Jun 2023 09:26 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 335 పాయింట్ల లాభంతో 62,882 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 92 పాయింట్ల లాభంతో 18,626 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు కుంగి 82.46 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో విప్రో, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. అమెరికా అప్పుల పరిమితి పెంపు బిల్లు చట్టరూపం దాల్చిన నేపథ్యంలో దాదాపు నెల రోజుల ఆందోళనకు తెరపడింది. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సైతం నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. 8న ఆర్‌బీఐ ప్రకటించనున్న ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలను ఈ వారమే ప్రకటించనున్నాయి. జులై నుంచి రోజువారీ చమురు ఉత్పత్తిలో 10 లక్షల బ్యారెల్స్‌ కోత విధిస్తామని సౌదీ అరేబియా ప్రకటించింది. దీంతో బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 1 డాలర్‌ పెరిగి 77.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని