Stock Market: సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. 23,600కు చేరిన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 186 పాయింట్లు పెరిగి 77,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 23,598 దగ్గర కొనసాగుతోంది.

Published : 19 Jun 2024 09:38 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 186 పాయింట్లు పెరిగి 77,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 23,598 దగ్గర కొనసాగుతోంది. రెండు ప్రధాన సూచీలు ఆరంభ ట్రేడింగ్‌లోనే సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.85.34 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

టెక్‌ స్టాక్స్‌లో వచ్చిన పరుగుతో అమెరికా మార్కెట్లు మంగళవారం రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మంగళవారం నికరంగా రూ.2,570 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.1,556 కోట్ల వాటాలను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని