Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,600

Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 104 పాయింట్లు లాభంతో 77,583 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 23,600 దగ్గర కొనసాగుతోంది.

Published : 21 Jun 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలున్నప్పటికీ.. ఆరంభంలో మన మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 104 పాయింట్లు లాభంతో 77,583 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 23,600 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.59 వద్ద ప్రారంభమైంది.  

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌యూఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా సూచీలు గురువారం గరిష్ఠాలను తాకాయి. లాభాల స్వీకరణతో చివరకు మిశ్రమంగా స్థిరపడ్డాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ.415 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.325 కోట్ల వాటాలను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని