Stock Market: సెన్సెక్స్‌కు 200 పాయింట్ల లాభం.. 23,600 చేరువలో నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 204 పాయింట్ల లాభంతో 77,545 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,594 దగ్గర కొనసాగుతోంది.

Updated : 25 Jun 2024 09:34 IST

Stock Market Opening bell | ముంబయి: ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 204 పాయింట్ల లాభంతో 77,545 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 23,594 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, నెస్లే ఇండియా, టైటన్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. టెక్‌ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాలతో నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు నష్టపోయాయి. మిగతా రంగాల్లో వచ్చిన ర్యాలీతో డోజోన్స్‌ భారీగా లాభపడింది. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు సానుకూలంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.98 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.654 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.820 కోట్ల వాటాలను అమ్మేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని