Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 23,480

Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 118 పాయింట్లు కుంగి 77,218 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 23,480 దగ్గర కొనసాగుతోంది.

Published : 20 Jun 2024 09:38 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ (Stock Market) సూచీలు గురువారం ఆరంభంలో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 118 పాయింట్లు కుంగి 77,218 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 23,480 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.43 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎం అండ్‌ ఎం, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, రిలయన్స్, మారుతీ, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

జూన్‌టీన్త్‌ సెలవు నేపథ్యంలో అమెరికా మార్కెట్లు బుధవారం పని చేయలేదు. ప్రస్తుతం అక్కడి ఫ్యూచర్స్‌ ఫ్లాట్‌గా ఉన్నాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.7,908 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.7,107 కోట్ల వాటాలను కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని