Stock Market: నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 23,400 దిగువన నిఫ్టీ

Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 233 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 113 పాయింట్లు కుంగి 23,387 దగ్గర కొనసాగుతోంది.

Published : 24 Jun 2024 09:40 IST

Stock Market Opening bell | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు (Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 233 పాయింట్ల నష్టంతో 76,976 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 113 పాయింట్లు కుంగి 23,387 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, మారుతీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా సూచీలు (Stock Market) గత వారాన్ని నష్టాలతో ముగించాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.18 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.1,790 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,237 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు. జీఎస్‌టీ సమావేశ నిర్ణయాలు నేటి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. ఈ వారం అలైడ్‌ బ్లెండర్స్, వ్రజ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఐపీఓలు ప్రాథమిక మార్కెట్‌ ముందుకురానున్నాయి. జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపుతో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని