Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 23,832

Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో 78,506 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 23,832 దగ్గర కొనసాగుతోంది.

Published : 27 Jun 2024 09:44 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 167 పాయింట్ల నష్టంతో 78,506 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 23,832 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.52 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎం అండ్‌ ఎం, మారుతీ, ఎల్‌ అండ్‌ టీ, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్‌, ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అమెరికా మార్కెట్లు (Stock Market) బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతకుముందు రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య కదలాడాయి. నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.07 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం నికరంగా రూ.3,535 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.5,104 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని