Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 24,294

Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 173 పాయింట్ల నష్టంతో 79,823 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 24,294 వద్ద ట్రేడవుతోంది.

Published : 08 Jul 2024 09:35 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 173 పాయింట్ల నష్టంతో 79,823 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 24,294 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గతవారం బలంగా ముగిశాయి. వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే సంకేతాలు బలపడటంతో అక్కడి సూచీలు రాణించాయి. ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 86.48 డాలర్ల వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.1,541 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,651 కోట్ల వాటాలను విక్రయించారు.

జూన్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం, మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మదుపర్లు ఈవారం దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అంతర్జాతీయంగా.. బ్రిటన్‌ కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, ఫ్రాన్స్‌ ఎన్నికల తుది ఫలితాలు ప్రభావం చూపొచ్చని తెలిపారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ ఈనెల 9న వెల్లడించనున్న అభిప్రాయాలను గమనించొచ్చని వెల్లడించారు. ఈ వారం టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, టాటా ఎలెక్సీ, ఐఆర్‌ఈడీఏ, డీమార్ట్‌ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని