Stock Market: స్తబ్దుగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 10 పాయింట్ల నష్టంతో 62,776 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 2 పాయింట్ల స్వల్ప లాభంతో 18,595 దగ్గర కొనసాగుతోంది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం స్తబ్దుగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 10 పాయింట్ల నష్టంతో 62,776 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 2 పాయింట్ల స్వల్ప లాభంతో 18,595 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.56 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, టైటన్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. యూఎస్ ఫ్యూచర్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.700.98 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,195.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న సౌదీ అరేబియా నిర్ణయం నేపథ్యంలో చమురు ధరలు ఎగబాకుతున్నాయి. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 77.42 బిలియన్ డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వాహన రిటైల్ విక్రయాలు గత నెలలో 10 శాతం పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా సోమవారం వెల్లడించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత ఇప్పటి వరకు 2.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21,730 కోట్లు) రుణాలు తిరిగి చెల్లించినట్లు సోమవారం అదానీ గ్రూప్ రుణ నివేదికను విడుదల చేసింది. మరోవైపు రూ.12,000 కోట్ల షేర్ల బైబ్యాక్ (తిరిగి కొనుగోలు)కు వాటాదార్లు ఆమోదం లభించినట్లు ఐటీ సంస్థ విప్రో సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. కోల్ ఇండియాలో 3 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.4,185 కోట్లు సమీకరించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పద్ధతిలో వాటా విక్రయం ద్వారా కంపెనీలో ప్రభుత్వ వాటా 63.13 శాతానికి తగ్గిందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా కంపెనీల స్టాక్స్‌పై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
Afcons Infra IPO: ఐదేళ్ల తర్వాత షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ వస్తోంది. నిర్మాణ రంగ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్‌యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్‌యూ7ను (ఎస్‌యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్‌కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్‌పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్‌ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!