Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 166 పాయింట్ల లాభంతో 57,795 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 45 పాయింట్లు లాభపడి 17,034 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 దగ్గర ప్రారంభమైంది.

Published : 15 May 2023 09:34 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 153 పాయింట్ల లాభంతో 62,181 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 37 పాయింట్లు లాభపడి 18,352 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

గతవారాన్ని అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతం యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ సైతం అదే బాటలో ఉన్నాయి. మరోవైపు నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. కూరగాయలు, వంటనూనెల ధరలు తగ్గడంతో ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగొచ్చింది. మార్చిలో భారత పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి 5 నెలల కనిష్ఠమైన 1.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 5.8 శాతం కావడం గమనార్హం. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, యాజమాన్యాల వ్యాఖ్యలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. కర్ణాటకలో అధికార భాజపా ఓడిపోవడంపై మార్కెట్లు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది! ఏప్రిల్‌ ఎగుమతులు- దిగుమతులు, డబ్యూపీఐ ద్రవ్యోల్బణం, రుణాల వృద్ధి గణాంకాలు ఈ వారంలోనే వెలువడనున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌: గత ఆర్థిక సంవత్సరం (2022-23) నాలుగో త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం ఆదాయం రూ.325.86 కోట్లు, నికర లాభం రూ.53.54 కోట్లుగా ఉన్నాయి.

టాటా మోటార్స్‌: మార్చి త్రైమాసికానికి టాటా మోటార్స్‌ మెరుగైన ఫలితాలు ప్రకటించింది. జనవరి-మార్చిలో  రూ.5,408 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో కంపెనీకి రూ.1,033 కోట్ల నికర నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.78,439 కోట్ల నుంచి రూ.1,05,932 కోట్లకు పెరిగింది. ఒక్కో సాధారణ షేరుకు రూ.2 తుది డివిడెండును; డీవీఆర్‌ వాటాదార్లకు రూ.2.1 చొప్పున డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.

కెనరా బ్యాంక్‌: పలు మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల అపరాధ రుసుమును విధించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం తెలిపింది.

హెచ్‌పీసీఎల్‌: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) మార్చి త్రైమాసికంలో రూ.3608.32 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.2018.45.

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌: డి-మార్ట్‌ రిటైల్‌ కేంద్రాలను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదికన రూ.460.10 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాలంలో ఆర్జించిన రూ.426.75 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 7.81 శాతం పెరిగింది.

అదానీ గ్రూప్‌: రెండు గ్రూప్‌ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా రూ.21,000 కోట్లు (2.5 బి.డాలర్లకు పైగా) సమీకరించాలని గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ భావిస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.12,500 కోట్లు; అదానీ ట్రాన్సిమిషన్‌ రూ.8,500 కోట్లు చొప్పున సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయా కంపెనీలు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని