Stock Market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు.. 18,650 పైకి నిఫ్టీ

Stock Market: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 176 పాయింట్ల లాభంతో 62,969 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 63 పాయింట్ల లాభంతో 18,662 దగ్గర కొనసాగుతోంది.

Published : 07 Jun 2023 09:28 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 176 పాయింట్ల లాభంతో 62,969 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 63 పాయింట్ల లాభంతో 18,662 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.56 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రమే స్వల్ప నష్టాల్లో ఉంది. నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. వచ్చేవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్‌ సమావేశంపై మదుపర్లు దృష్టి సారించారు. ఆసియా పసిఫిక్‌ సూచీలు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. చమురు ఉత్పత్తి కోతలను సౌదీ అరేబియా అధికారికంగా ధ్రువీకరించిన నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈసారి కూడా కీలక రేట్లను యథాతథంగా ఉంచొచ్చనే అభిప్రాయాన్ని చాలా మంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప విరామం తర్వాత విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం తిరిగి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు నిన్న రూ.385 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.489 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని