Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ @18,050
Stock Market: సెన్సెక్స్ 150, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. మారుతీ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 175 పాయింట్ల నష్టంతో 60,806 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 60 పాయింట్లు నష్టపోయి 18,056 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.62 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ (Sensex)30 సూచీలో మారుతీ, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. చైనా, హాంకాంగ్ సూచీలు ఇంకా సెలవులోనే ఉన్నాయి. భారత జీడీపీ వృద్ధి రేటు 2023- 24లో 5.6 శాతానికి పరిమితం కానున్నట్లు మూడీస్ తెలిపింది. అయితే, ప్రపంచంలోకెల్లా భారత వృద్ధి రేటే మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ మాంద్యం భయాలతో పాటు అమెరికాలో చమురు నిల్వలు ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగాయన్న నివేదికలతో చమురు ధరలు దిగొచ్చాయి. మార్చి డెలివరీలకు సంబంధించి బ్రెంట్ ఫ్యూచర్స్ పీపా ధర 2.3 శాతం తగ్గి 86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: టాటా మోటార్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, అమరరాజా బ్యాటరీస్, డిక్సన్ టెక్, డీఎల్ఎఫ్, ఈక్విటాస్ హోల్డింగ్స్, టాటా ఎల్క్సీ, టొరెంట్ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్
గమనించాల్సిన స్టాక్స్..
మారుతీ సుజుకీ ఇండియా: డిసెంబరు త్రైమాసికంలో మారుతీ సుజుకీ రూ.2,351 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.1,011.3 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా (129.7%) ఎక్కువ. ఇదే సమయంలో నికర విక్రయాలు రూ.22,187.6 కోట్ల నుంచి రూ.27,849.2 కోట్లకు చేరాయి.
టీవీఎస్ మోటార్: కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.304 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.237 కోట్లతో పోలిస్తే ఇది 28% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,606 కోట్ల నుంచి రూ.8,075 కోట్లకు పెరిగింది.
యూకో బ్యాంక్: డిసెంబరు త్రైమాసికంలో రూ.653 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.310 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు కంటే (110%) అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.4638 కోట్ల నుంచి రూ.5451 కోట్లకు పెరిగింది.
పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం 43 శాతం పెరిగి రూ.269 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.1,411 కోట్ల నుంచి రూ.1,713.64 కోట్లకు చేరింది.
ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్: కంపెనీ నికర లాభం అక్టోబరు- డిసెంబరులో 32 శాతం పెరిగి రూ.509 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం 386 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.3,140 కోట్ల నుంచి రూ.3,656 కోట్లకు పెరిగింది.
గ్రాన్యూల్స్ ఇండియా: మూడో త్రైమాసికానికి రూ.1146 కోట్ల ఆదాయాన్ని, రూ.124 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.997 కోట్లు, నికరలాభం రూ.101 కోట్లు ఉన్నాయి. వీటితో పోల్చితే ఈసారి ఆదాయం 15%, నికరలాభం 23% పెరిగాయి.
కావేరీ సీడ్ కంపెనీ: డిసెంబరు త్రైమాసికానికి రూ.123.49 కోట్ల ఆదాయాన్ని, రూ.37.54 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.102.08 కోట్లు, నికరలాభం రూ.9.08 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 20.97%, నికరలాభం 313% పెరిగాయి.
కాఫీ డే ఎంటర్ప్రైజెస్: అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలపై, కేఫ్ కాఫీడే లను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ.26 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
sandoz: హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న శాండోస్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: నెల్లూరు జిల్లాలో వైకాపా కోటకు బీటలు.. పార్టీకి దూరమవుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
-
India News
Asaram Bapu: అత్యాచారం కేసులో.. ఆశారాంకు మరోసారి జీవితఖైదు
-
General News
CRPF Jobs: సీఆర్పీఎఫ్లో ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే తుది గడువు
-
Crime News
Bribe: రూ.2.25 లక్షల లంచం తీసుకుంటూ.. అనిశాకు చిక్కిన అధికారి