Stock Market: 62,000 ఎగువన ముగిసిన సెన్సెక్స్.. 18,300 పైకి నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 123.38 పాయింట్ల లాభంతో 62,027.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) చివరకు 17.80 పాయింట్లు లాభపడి 18,314.80 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. అక్కడి నుంచి కొనుగోళ్ల మద్దతుతో స్థిరంగా కొనసాగాయి. సెన్సెక్స్ ఐదు నెలల గరిష్ఠం వద్ద ముగిసింది. బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు రాణించడం మార్కెట్లకు మద్దతుగా నిలిచింది. ఆసియా- పసిఫిక్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 61,857.69 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,110.93 దగ్గర గరిష్ఠాన్ని, 61,578.15 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 123.38 పాయింట్ల లాభంతో 62,027.90 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,273.75 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,342.75- 18,194.55 మధ్య కదలాడింది. చివరకు 17.80 పాయింట్లు లాభపడి 18,314.80 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏడు పైసలు పతనమై 82.16 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్‌లోని ఇతర విషయాలు..
☛ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఆదాయం 8 శాతం పెరిగి రూ.12,494 కోట్లకు చేరింది. నికర లాభం 9 శాతం పుంజుకొని రూ.2,831 కోట్లకు పెరిగింది. కంపెనీ షేరు ఈరోజు 1.42 శాతం నష్టపోయి రూ.2,975.40 దగ్గర ముగిసింది.
☛ సీమెన్స్ షేరు విలువ ఈరోజు 2.66 శాతం లాభపడి రూ.3,898 వద్ద స్థిరపడింది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. ఆదాయం 27.8 శాతం, నికర లాభం 38.76 శాతం పెరిగింది.
☛ మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో జెన్సర్ టెక్ షేరు విలువ ఇంట్రాడేలో 14 నెలల గరిష్ఠానికి చేరింది. చివరకు 9.41 శాతం లాభంతో రూ.339.45 దగ్గర స్థిరపడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Train Accident: రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
India News
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారుల బదిలీలపై ఈసీ కీలక ఆదేశాలు
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
India News
Gaganyaan: నో సాంబార్ ఇడ్లీ.. ఇస్రో చీఫ్ చెప్పిన గగన్‌యాన్ ముచ్చట్లు
-
Politics News
Pawan Kalyan: వారాహిపై ఈనెల 14 నుంచి పవన్ పర్యటన: నాదెండ్ల