Stock Market: వరుసగా రెండో రోజూ నష్టాలు.. 18,500 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 193.70 పాయింట్ల నష్టంతో 62,428.54 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 46.65 పాయింట్లు నష్టపోయి 18,487.75 దగ్గర ముగిసింది.

Updated : 01 Jun 2023 16:02 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. దీంతో వరుసగా రెండోరోజూ నష్టాలు నమోదయ్యాయి. ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాలతో ట్రేడయ్యాయి. చివరి గంటన్నరలో పూర్తిగా నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల వద్ద నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. మరోవైపు ఈరోజు వీక్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ కూడా మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 62,736.47 దగ్గర ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,762.41- 62,359.14 మధ్య కదలాడింది. చివరకు 193.70 పాయింట్ల నష్టంతో 62,428.54 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,579.40 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,580.30- 18,464.55 మధ్య ట్రేడైంది. చివరకు 46.65 పాయింట్లు నష్టపోయి 18,487.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 33 పైసలు పుంజుకొని 82.42 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, ఇన్ఫోసిస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని