Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 17,100 పైకి నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ (Sensex) 445.73 పాయింట్ల లాభంతో 58,074.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 119.10 పాయింట్లు లాభపడి 17,107.50 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగంలోని పరిణామాలతో నిన్న సంభవించిన నష్టాలు ఈరోజు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలూ సూచీలకు మద్దతుగా నిలిచాయి. ఫెడ్ సమావేశం ఈరోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు కొంత వరకు అప్రమత్తంగానే వ్యవహరించినట్లు నిపుణులు తెలిపారు.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 57,963.27 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 58,133.33 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరకు 445.73 పాయింట్ల లాభంతో 58,074.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,060.40 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 17,127.70 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 119.10 పాయింట్లు లాభపడి 17,107.50 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు పతనమై 82.68 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టైటన్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిసిన జాబితాలో ఉన్నాయి. పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.
మార్కెట్‌లోని ఇతర విషయాలు..
☛ టీసీఎస్ గత తొమ్మిది వరుస సెషన్లలో 8 శాతం నష్టపోయింది. ఈరోజు ఇంట్రాడేలో ఈ షేరు 1.13 శాతం నష్టపోయింది. చివరకు 1.03 శాతం కుంగి రూ.3,111 వద్ద స్థిరపడింది.
☛ మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో ఈరోజు 10.3 లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో కంపెనీ షేరు ఈరోజు 0.94 శాతం నష్టంతో రూ.463.80 వద్ద ముగిసింది.
☛ ఎన్‌టీపీసీ రిన్యూవబుల్ ఎనర్జీకి చెందిన 300 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు సోలార్ బ్లాక్‌లను చేపట్టడానికి స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఎనర్జీ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. దీంతో స్టెర్లింగ్ అండ్ విల్సన్ షేరు ఈరోజు 2.97 శాతం పెరిగి రూ.213.05 దగ్గర స్థిరపడింది.
☛ లార్సెన్ అండ్ టుబ్రో రూ.5,000- 7,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.27 శాతం పెరిగి రూ.2,205.25కు చేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)