Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: సెన్సెక్స్ (Sensex) 317.81 పాయింట్ల లాభంతో 62,345.71 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 84.05 పాయింట్లు లాభపడి 18,398.85 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. దీంతో వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలు నమోదయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఐదు నెలల గరిష్ఠం వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. స్థిరాస్తి, మీడియా రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా సూచీలు ప్రస్తుతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 62,157.10 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,562.67 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 317.81 పాయింట్ల లాభంతో 62,345.71 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,339.30 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,458.90 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 84.05 పాయింట్లు లాభపడి 18,398.85 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు పతనమై 82.31 దగ్గర నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్‌లోని ఇతర విషయాలు..
☛ మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ ప్రకటించిన ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 2.80 శాతం పెరిగి రూ.530.45 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు 4 శాతానికి పైగా పెరిగి 52 వారాల గరిష్ఠాన్ని తాకింది.
☛ మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను కల్యాణ్ జువెలర్స్ సోమవారం ప్రకటించింది. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభంలో 3.11 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం రూ.3,396 కోట్లకు చేరింది. కంపెనీ షేరు ఈరోజు 1.84 శాతం నష్టపోయి రూ.106.55 దగ్గర స్థిరపడింది.
☛ మార్చితో ముగిసిన త్రైమాసికంలో డీఎల్‌ఎఫ్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 7.36 శాతం పుంజుకొని రూ.468.05 దగ్గర నిలిచింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni: ధోని.. మోకాలి గాయాన్ని బట్టే తుదినిర్ణయం: సీఎస్కే సీఈవో విశ్వనాథన్
-
Crime News
Khammam: లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
Crime News
Gang rape: విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. కాలిన గాయాలతో మృతి
-
Sports News
Virat Kohli: కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో.. గర్భం దాల్చిన 29 ఏళ్ల ప్రియురాలు