Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: సెన్సెక్స్ (Sensex) 240.36 పాయింట్ల లాభంతో 62,787.47 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 59.75 పాయింట్లు లాభపడి 18,593.85 దగ్గర ముగిసింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాల నుంచి దిగొచ్చాయి. ఉదయం సెన్సెక్స్ (Sensex) 62,759.19 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,943.20- 62,751.72 మధ్య కదలాడింది. చివరకు 240.36 పాయింట్ల లాభంతో 62,787.47 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,612.00 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,640.15- 18,582.80 మధ్య ట్రేడైంది. చివరకు 59.75 పాయింట్లు లాభపడి 18,593.85 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు పతనమై రూ.82.68 దగ్గర నిలిచింది.
సెన్సెక్స్ (Sensex)30 సూచీలో ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐటీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, ఎన్‌టీపీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.
మార్కెట్‌లోని ఇతర విషయాలు..
☛ మహీంద్రా గ్రూప్ అమర్‌జ్యోతి బారువాను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా (గ్రూప్ స్ట్రాటజీ) నియమించింది. గ్రూప్ స్ట్రాటజీ ఆఫీస్‌కు నేతృత్వం వహిస్తూ గ్రూప్‌లోని అన్ని వ్యాపారాలతో ఆయన దగ్గరగా పనిచేయనున్నారు. ఎంఅండ్‌ఎం షేరు ధర ఈరోజు 3.99 శాతం పుంజుకొని రూ.1,394.95 దగ్గర ముగిసింది.
☛ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ రాజస్థాన్‌లోని బైకనూర్‌లో 110 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈరోజు టాటా పవర్ షేరు విలువ 1.51 శాతం పెరిగి రూ.218.90 దగ్గర స్థిరపడింది.
☛ గుజరాత్‌లోని అంభేటీలో నెలకొల్పిన యూనిట్‌లో వాణిజ్య తయారీ ప్రారంభించినట్లు ఎంకాన్ రసాయన్ ఇండియా ప్రకటించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 4.90 శాతం పెరిగి రూ.110.30 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!
-
TS High Court: అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనంపై ఆంక్షలు.. ఆందోళనకు దిగిన మండపాల నిర్వాహకులు
-
Harish Rao: మంత్రి మండలి సిఫార్సులను తిరస్కరించడం దారుణం: హరీశ్‌రావు
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?