Stock Market: సెన్సెక్స్‌కు 224 పాయింట్ల లాభం.. నిఫ్టీ ఫ్లాట్‌గా..!
Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండోరోజూ మిశ్రమంగా ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో ముగియగా.. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో స్థిరపడింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కూడా మిశ్రమంగానే ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు దాదాపు చివరి గంటన్నర ముందు వరకు అదే బాటలో పయనించాయి. ఆఖర్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. కానీ, ముగింపునకు ముందు నిఫ్టీలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది.
★ ఉదయం సెన్సెక్స్ (Sensex) 59,459.87 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 60,007.67- 59,215.62 మధ్య కదలాడింది. చివరకు 224.16 పాయింట్ల లాభంతో 59,933.84 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 17,517.10 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 17,653.90- 17,445.95 మధ్య ట్రేడయ్యింది. చివరకు 5.90 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,612.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.17 వద్ద నిలిచింది.
★ సెన్సెక్స్ (Sensex)30 సూచీలో 16 షేర్లు లాభపడ్డాయి. ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ షేర్లు అధికంగా లాభపడ్డ జాబితాలో ఉన్నాయి. ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, టైటన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి.
మార్కెట్లోని ఇతర సంగతులు..
★ అదానీ గ్రూప్ షేర్ల పతనం ఈరోజు కూడా కొనసాగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ఏకంగా 27 శాతం పతనమైంది. అదానీ పవర్, అదానీ విల్మర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ లోయర్ సర్క్యూట్లను తాకాయి. అదానీ బాండ్లకు ఎలాంటి విలువ లేదంటూ క్రెడిట్ సూయిజ్ చేసిన వ్యాఖ్యలు సహా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీఓను ఉపసంహరించుకోవడం వంటి పరిణామాలు గ్రూప్ షేర్లపై ప్రభావం చూపాయి.
★ డాబర్ ఇండియా మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. లాభం 5 శాతం క్షీణించినట్లు నివేదించింది. కంపెనీ షేరు ఈరోజు 1.24 శాతం తగ్గి రూ. 555 వద్ద ముగిసింది.
★ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో టైటన్ కంపెనీ నికర లాభం 4 శాతం తగ్గింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 1.07 శాతం నష్టపోయి రూ.2,321.95 వద్ద స్థిరపడింది.
★ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో బ్రిటానియా మెరుగైన ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు 4.85 శాతం లాభపడి రూ. 4,581 వద్ద స్థిరపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్‌యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్‌యూ7ను (ఎస్‌యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్‌కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్‌పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్‌పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్‌ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ