Stock Market: లాభాల్లో మార్కెట్ సూచీలు..18,100 ఎగువకు నిఫ్టీ
Stock Market: సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభంలో ఉన్నాయి.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 355 పాయింట్ల లాభంతో 60,995 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 102 పాయింట్లు లాభపడి 18,130 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.98 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ (Sensex) 30 సూచీలో టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గతవారాన్ని లాభాలతో ముగించాయి. ఆస్ట్రేలియా సూచీలు నేడు 9 నెలల గరిష్ఠానికి చేరడం విశేషం. అమెరికా టెక్ స్టాక్స్‌లో ర్యాలీ ఇక్కడి మార్కెట్లకు కలిసొచ్చింది. ఆసియా- పసిఫిక్ మార్కెట్లలో ప్రధాన సూచీలు సెలవుల నేపథ్యంలో నేడు పనిచేయడం లేదు. విదేశీ మదుపర్ల క్రయవిక్రయాలు, కార్పొరేట్ ఫలితాలు, రాబోయే బడ్జెట్ అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్, గ్లాండ్ ఫార్మా, గ్రావిటా ఇండియా, హెచ్ఎఫ్సీఎల్, జేఅండ్‌కే బ్యాంక్, జిందాల్ స్టెయిన్లెస్, పూనావాలా ఫిన్‌కార్ప్, సింజీన్ ఇంటర్నేషనల్, టాటా కమ్యూనికేషన్స్
గమనించాల్సిన స్టాక్స్..
రిలయన్స్ ఇండస్ట్రీస్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రూ.2,20,592 కోట్ల ఆదాయంపై రూ.15,792 కోట్ల నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.23.34) ఆర్జించింది. 2021-22 ఇదే త్రైమాసికంలో రూ.1,91,271 కోట్ల ఆదాయంపై రూ.18,549 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని (ఒక్కో షేరుకు రూ.28.08) పొందింది. అంటే నికర లాభం 15% తగ్గితే, ఆదాయం 15% పెరిగింది.
ఎల్‌టీఐమైండ్‌ట్రీ: డిసెంబరు త్రైమాసికానికి ఎల్‌టీఐమైండ్‌ట్రీ ఏకీకృత ప్రాతిపాదికన రూ.1,000.70 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,050.10 కోట్లతో పోలిస్తే ఈసారి 4.6 శాతం తగ్గింది. విలీన సంబంధిత వ్యయాల ప్రభావం పడటం ఇందుకు కారణమైంది. గతేడాది నవంబరులో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్‌ట్రీ విలీనమై దేశంలోనే ఆరో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీ గా అవతరించిన సంగతి తెలిసిందే.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండలోన్ పద్ధతిలో రూ.2,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 అక్టోబరు- డిసెంబరు లాభం రూ.1,085 కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపునకు పైగా పెరిగింది. మొత్తం ఆదాయం రూ.19,454 కోట్ల నుంచి రూ.24,154 కోట్లకు పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంక్: డిసెంబరు త్రైమాసికంలో రూ.8,792 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో బ్యాంకు నమోదు చేసిన రూ.6,536 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 34.5 శాతం అధికం. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ.6,194 కోట్ల నుంచి 34.2 శాతం పెరిగి రూ.8,312 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.27,069 కోట్ల నుంచి రూ.33,529 కోట్లకు ఎగబాకింది.
అల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.1,062.58 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22లో ఇదే కాలంలోని రూ.1,710.14 కోట్లతో పోలిస్తే లాభం 37.9 శాతం తగ్గింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.12,984.93 కోట్ల నుంచి 19.53 శాతం పెరిగి రూ.15,520.93 కోట్లకు చేరింది.
యెస్ బ్యాంక్: అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో యెస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం 79 శాతం క్షీణించి రూ.55.07 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిలకు కేటాయింపులు పెరగడం ఇందుకు కారణమైంది. నికర వడ్డీ ఆదాయం 11.7 శాతం పెరిగి రూ.1,971 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 10 శాతం వృద్ధి ఇందుకు దోహదం చేసింది.
కొటాక్ మహీంద్రా బ్యాంక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి స్టాండలోన్ పద్ధతిలో రూ.2,792 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాతో పోలిస్తే ఇది 31 శాతం అధికం. ఆదాయం సైతం రూ.8,260 కోట్ల నుంచి రూ.11,099 కోట్లకు పెరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!