Stock Market: లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening Bell: దేశీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ 76,500 మార్క్‌ పైన, నిఫ్టీ 23,300 మార్క్‌పైన ట్రేడ్‌ అవుతున్నాయి.

Published : 12 Jun 2024 09:38 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు ఉత్సాహంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 278 పాయింట్ల లాభంతో 76,735 వద్ద, నిఫ్టీ (Nifty) 92 పాయింట్ల లాభంతో 23,357 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 83.54గా కొనసాగుతోంది. నిఫ్టీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, భారత్‌ పెట్రోలియం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, విప్రో షేర్లు రాణిస్తుండగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ , గ్రాసిమ్‌, ఎన్టీపీసీ, హిందుస్థాన్‌ యునిలివర్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. యాపిల్‌ వంటి దిగ్గజ సంస్థల షేర్లు రాణించడంతో ఎస్‌ అండ్‌ పీ, నాస్‌డాక్‌ సూచీలు కొత్త గరిష్ఠాలను తాకాయి. అయితే డోజోన్స్‌ మాత్రం స్వల్పంగా నష్టపోయింది. ఇక, ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీలు నష్టాల్లో ఉండగా.. దక్షిణ కొరియా కోస్పి సూచీ లాభాల్లో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని