ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పోకడలు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులలో రెండు రకాల పోకడలు ఉంటాయి. ఒకటి వృద్ధి, రెండు విలువ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ. నష్టభయం, రాబడులు లేదా ఇతర అంశాల పరంగా కొత్త మదుపరులకు ఇవి ఎలా సరిపోతాయి.....
క్విటీ మ్యూచువల్ ఫండ్ల పోకడలు, మదుపరులకు అవి ఏ రకంగా ప్రయోజనకరమే తెలుసుకుందాం
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులలో రెండు రకాల పోకడలు ఉంటాయి. ఒకటి వృద్ధి, రెండు విలువ. ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ. నష్టభయం, రాబడులు లేదా ఇతర అంశాల పరంగా కొత్త మదుపరులకు ఇవి ఎలా సరిపోతాయి. ఒక వ్యక్తి వ్యూహాత్మకంగా తన ఈక్విటీ పెట్టుబడులను, ఆర్థిక లక్ష్యాల సాధనకు అవసరమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకునే ముందు ఈ రెండు అంశాల మధ్య తేడాను గుర్తించడం ముఖ్యం.
వృద్ధి పోకడలు:
ఈ తరహా పెట్టుబడులలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు భవిష్యత్‌లో ఇతర కంపెనీల కంటే అధికంగా రాణించే కంపెనీలలో పెట్టుబడులు పెడతారు. ఇందులో ఆయా కంపెనీల రాబడులు, లాభాలు, నగదు నిల్వలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇలాంటి అధిక వృద్ధి గల కంపెనీలు తమ మార్కెట్ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి వచ్చిన రాబడులను వేగంగా తిరిగి పెట్టుబడులుగా పెడుతూ పోతూ ఉంటాయి.
ఇది దీర్ఘకాలంలో మదుపరులకు మంచి రాబడులందించేందుకు దోహదం చేస్తుంది. అయితే ఇది ఒక్కోసారి అసలుకే ఎసరు తేవచ్చు. ఎందుకంటే సరైన క్రమంలో పెట్టుబడులు పెట్టడంలో విఫలం చెందితే కంపెనీలకు నష్టాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అధిక వృద్ధినిచ్చే కంపెనీలలో రిస్క్ కూడా ఎక్కువే అన్న విషయాన్ని మరవవద్దు.
అయితే ఈ తరహా కంపెనీలు వర్తమానంలో ఎలాంటి రాబడులివ్వకపోయినప్పటికీ, కంపెనీ భవిష్యత్ సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకుని మదుపరులు ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటారు.
ముఖ్యమైన లక్షణాలు:
అధిక వ్యయం:
ఈ తరహా ఫండ్లు అధిక విలువ, వ్యయంతో కూడినవి. కంపెనీ మూలాలైన అమ్మకాలు, లాభాలు, డివిడెండ్లతో పోలిస్తే, వాటి స్టాక్
ధరలు అధికంగా ఉంటాయి. భవిష్యత్‌లో కంపెనీ పనితీరు వేగంగా ఉంటుందన్న మదుపరుల అంచనాలే ఇందుకు కారణం.
తక్కువ భద్రత:
ప్రస్తుతం గ్రోత్ ఫండ్లలో ధరల ఒడుదొడుకులు అనూహ్యంగా ఉంటున్నాయి. రిస్క్ తట్టుకునే సామర్థ్యం, దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించే మదుపరులకు ఈ తరహా ఫండ్లు సరిగ్గా సరిపోతాయి.
విలువ పోకడలు:
ఈ తరహా పెట్టుబడులలో ఫండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టే కంపెనీల షేర్ల ధరలు వాటి మూల విలువలను ప్రతిబింబంచవు. వీటిలో పెట్టుబడులు పెట్టే మదుపరులు వాటిని విక్రయించేటప్పుడు వాటి షేర్ల ధరలు వర్తమానంలోని రాబడులు, ఆస్తులు, ఇతర ప్రాథమిక లక్షణాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.
వ్యాపారంలో లేదా పరిశ్రమలో ఏర్పడిన తాత్కాలిక సర్దుబాట్లు, వృద్ధి అంచనాలు కొరవడటం వల్ల ఈ కంపెనీల రాబడులు వర్తమానంలో తగ్గినట్లుగా కనిపిస్తాయి. దీంతో మార్కెట్లో ధరల హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. అయితే కొంత కాలం గడిచిన తర్వాత ఈ తరహా కంపెనీల అసలు విలువను మదుపరులు గుర్తించి పెట్టుబడులు పెట్టడంతో, షేర్ల ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయి.
ముఖ్యమైన లక్షణాలు:
తక్కువ వ్యయం:
వర్తమానంలో ఆయా కంపెనీల షేర్ల ధరలు, వాటి అమ్మకాలు, లాభాలు, డివిడెండ్లతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.
భద్రత ఎక్కువ:
మదుపరులు ఈ రకం కంపెనీల షేర్లను తక్కువ ధరలకే కొంటారు. కాబట్టి పెట్టుబడులకు రిస్క్ తక్కువ.
అధిక వృద్ధి గల కంపెనీల వృద్ధి అంచనాలలో ఏ చిన్న మార్పు సంభవించినా అది ఆయా కంపెనీల విలువను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మదుపరులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మొదటగా ఆయా కంపెనీల వృద్ధి అంచనాలను పరిగణలోనికి తీసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు