SSY: నెల‌కు రూ.12,500 పెట్టుబ‌డితో రూ.64 ల‌క్ష‌లు కూడ‌బెట్టొచ్చు. ఎలాగంటే..!

ఎస్ఎస్‌వై ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు 7.60 శాతం. ఇది స‌గ‌టు ద్ర‌వ్యోల్బ‌ణ రేటు కంటే కూడా ఎక్కువే. కాబ‌ట్టి రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని, 10 ఏళ్ల లోపు ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, త‌మ పాప పేరుతో ఈ ఖాతాను తెర‌వ‌చ్చు.

Updated : 11 Aug 2022 13:25 IST

ప్ర‌భుత్వ హామీ ఉన్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న (SSY) ఒక‌టి. ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని 2015 లో ప్ర‌వేశ‌పెట్టింది. 10 ఏళ్ల లోపు వ‌య‌సున్న ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ పాప భ‌విష్య‌త్తు కోసం ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం 'ఈఈఈ' కేట‌గిరిలో ప‌న్ను ప్ర‌యోజ‌నాలు అందిస్తుంది. అంటే పెట్టుబ‌డి, వ‌డ్డీఆదాయం, మెచ్యూరిటీ మొత్తంపై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఈ ప‌థ‌కంలో ఏడాదికి గ‌రిష్ఠ‌గా రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టే వీలుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 80సీ కింది రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 

ఎస్ఎస్‌వై ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు 7.60 శాతం. ఇది స‌గ‌టు ద్ర‌వ్యోల్బ‌ణ రేటు కంటే కూడా ఎక్కువే. కాబ‌ట్టి రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని, 10 ఏళ్ల లోపు ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, త‌మ పాప పేరుతో ఈ ఖాతాను తెర‌వ‌చ్చు. ఈ ప‌థ‌కంలో 15 ఏళ్ల పాటు పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. 21 ఏళ్ల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. పాప‌కు 18 సంవ‌త్స‌రాలు నిండిన త‌ర్వాత‌, పాప ఉన్న‌త చ‌దువుల కోసం ఎస్ఎస్‌వై నిధి నుంచి 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. పాప‌కు వివాహం అయిన త‌ర్వాత లేదా మెచ్యూరిటీ త‌ర్వాత పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మెచ్యూరిటీ త‌ర్వాత ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించిన ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎందుకంటే మెచ్యూరిటీ త‌ర్వాత ఖాతాలోని మొత్తంపై వ‌డ్డీ రాదు. 

ప్ర‌స్తుతం మీ పాప వ‌య‌సు 2 సంవ‌త్స‌రాలు..2022 ఏప్రిల్ 1న ఖాతా ప్రారంభించారు అనుకుందాం. మీరు 2037 వ‌ర‌కు పెట్టుబ‌డులు కొన‌సాగించాల్సి ఉంటుంది. అలాగే 2043 నాటికి ఖాతా మెచ్యూర్ అవుతుంది. నెల నెలా రూ. 500 నుంచి రూ. 12,500 (గ‌రిష్ఠ‌గా అనుమ‌తించిన ప‌రిమితి) వ‌ర‌కు వివిధ‌ పెట్టుబ‌డుల‌ను అనుస‌రించి మెచ్యూరిటీ పూర్త‌య్యే నాటికి ఎంత మొత్తం చేతికందుతుందో ఇప్పుడు చూద్దాం.

గుర్తుంచుకోండి..
పెట్టుబ‌డుల‌ను ప్ర‌తీ నెల 5వ‌ తేది లోపు ఖాతాలో డిపాజిట్ చేయ‌డం వ‌ల్ల ఆ నెల వ‌డ్డీ కూడా ఖాతాకు జ‌మ‌వుతుంది. ఒకవేళ 5వ‌ తేది త‌ర్వాత జ‌మ‌చేస్తే..ఆ నెల వ‌డ్డీ వ‌ర్తించ‌దు. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌తీనెల 5లోపు ఖాతాలో డ‌బ్బు డిపాజిట్ చేసేలా చూసుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని