Sun Pharma: సన్‌ఫార్మాపై ర్యాన్సమ్‌వేర్‌ దాడి.. ఆదాయాలు తగ్గొచ్చన్న కంపెనీ

Ransomware attack on Sun Pharma: సన్‌ఫార్మా కంపెనీపై ర్యాన్సమ్‌వేర్‌ గ్రూప్‌ దాడి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనివల్ల తమ ఆదాయాలపై ప్రభావం పడొచ్చని ఆ కంపెనీ తెలిపింది.

Published : 27 Mar 2023 16:27 IST

దిల్లీ: ప్రముఖ ఫార్మా సంస్థ సన్‌ఫార్మాపై (Sun Pharma) హ్యాకర్లు దాడి చేశారు. ఓ ర్యాన్సమ్‌వేర్‌ గ్రూప్‌ (Ransomware attack) ఈ దాడికి పాల్పడింది.  సన్‌ఫార్మానే ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ర్యాన్సమ్‌ వేర్‌ గ్రూప్‌ దాడి కారణంగా ఆదాయాలపై ప్రభావం పడొచ్చని తెలిపింది. సన్‌ఫార్మా ఐటీ సిస్టమ్స్‌పై మార్చి 2న హ్యాకర్ల దాడి జరిగింది. అప్పట్లో కోర్‌ సిస్టమ్స్‌మీద గానీ, తమ కార్యకలాపాలపై గానీ ఎలాంటి ప్రభావం పడలేదని తెలిపిన ఆ సంస్థ.. తాజాగా దాడికి సంబంధించిన వివరాలను ఎక్ఛ్సేంజీకిచ్చిన సమాచారంలో పేర్కొంది.

ర్యాన్సమ్‌ వేర్‌ గ్రూప్‌ దాడిలో కంపెనీకి సంబంధించిన డేటాతో పాటు పర్సనల్‌ డేటాపై కూడా ప్రభావం పడిందని సన్‌ఫార్మా తెలిపింది. ఐటీ సెక్యూరిటీపై ప్రభావం పడగానే వెంటనే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. వెంటనే నెట్‌వర్క్‌ను ఐసోలేట్‌ చేశామని, రికవరీ ప్రాసెస్‌ను ప్రారంభించామని తెలిపింది. ర్యాన్సమ్‌వేర్‌ అటాక్‌తో వ్యాపార కార్యకాపాలపై సైతం ప్రభావం పడిందని, దీని మూలంగా ఆదాయాలు తగ్గొచ్చని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. ర్యాన్సమ్‌వేర్‌ అటాక్‌ కారణంగా కంపెనీపై పడిన ప్రతికూల ప్రభావాలను ఇప్పుడే అంచనా వేయలేమని తెలిపింది. ర్యాన్సమ్‌ వేర్‌ అటాక్‌ దాడి వార్తలు బయటకు వచ్చినప్పటికీ షేర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు