Suzuki: E20 ఫ్యూయల్‌ ఇంజిన్‌తో సుజుకీ యాక్సెస్‌, బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌

Suzuki Motorcycle: ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన స్కూటర్లను సుజుకీ మార్కెట్లోకి విడుదల చేసింది.

Published : 01 Mar 2023 20:23 IST

దిల్లీ: కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన స్కూటర్లను సుజుకీ మోటార్‌ సైకిల్‌ (Suzuki Motorcycle) ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మార్పులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దింది. యాక్సెస్‌, అవెనిస్‌, బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌ ఇందులో ఉన్నాయి. వీటిలో ఆన్‌బోర్డ్‌ డయాగ్నోస్టిక్స్‌ (OBD2-A) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా తెలిపింది.

యాక్సెస్‌, అవెనిస్‌, బర్గ్‌మ్యాన్‌ స్ట్రీట్‌లో E20 ఫ్యూయల్‌తో (20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) నడిచే విధంగా ఇంజిన్లను అమర్చినట్లు తెలిపింది. త్వరలో మిగిలిన పోర్ట్‌ఫోలియోనూ E20 ఫ్యూయల్‌తో నడిచే విధంగా తీర్చిదిద్దనున్నట్లు సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) దేవాశిష్‌ హండ ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు