Swaraj Tractor: స్వరాజ్ నుంచి ‘టార్గెట్’ లైట్‌వెయిట్ ట్రాక్టర్లు
Swaraj Tractors: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్ ట్రాక్టర్స్ మరో కొత్త రేంజ్ ట్రాక్టర్లను తీసుకొచ్చింది. టార్గెట్ పేరిట తీసుకొస్తున్న ఈ ట్రాక్టర్లు ఉద్యానపంటల సాగులో ఉపయోగకరంగా ఉండనున్నాయి.
ముంబయి: స్వరాజ్ ట్రాక్టర్స్ (Swaraj Tractors) కొత్త రేంజ్ లైట్‌వెయిట్ ట్రాక్టర్స్‌ను శుక్రవారం విడుదల చేసింది. వీటి ధర రూ.5.35 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమైంది. టార్గెట్ 630 (Target 630), టార్గెట్ 625 (Target 625) పేరిట రెండు ట్రాక్టర్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 20- 30 హెచ్‌పీ కేటగిరీలో వీటిని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంది.
టార్గెట్ 630 (Target 630) తొలుత మహారాష్ట్ర, కర్ణాటకలోని తమ డీలర్ నెట్‌వర్క్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నట్లు స్వరాజ్ తెలిపింది. టార్గెట్ 625 (Target 625)ని మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి తీసుకొస్తామని పేర్కొంది. టార్గెజ్ రేంజ్ ట్రాక్టర్లలో అత్యాధునిక టెక్నాలజికల్ ఫీచర్లను పొందుపర్చినట్లు తెలిపింది. మందుల పిచికారీ సహా ఇతర పనుల్లో మంచి సామర్థ్యం కనబరుస్తాయని పేర్కొంది. ఉద్యానపంటల సాగులో ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్